బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుంది, వీకెండ్ ను సినిమా అతి కష్టం మీద ముగించగా కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి. టార్గెట్ మరీ పెద్దది అవ్వడం తో సినిమా మినిమమ్ ఇంపాక్ట్ కూడా చూపలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చేతులు ఎత్తేసింది. దాంతో వీకెండ్ ముగిసే సరికే సినిమా ఫేట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది.
సినిమా మూడో రోజు ముందు అనుకున్నట్లే 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసింది, వరల్డ్ వైడ్ గా కూడా 1.37 కోట్ల రేంజ్ షేర్ తోనే సరి పెట్టుకుంది సినిమా. దాంతో మూడో రోజు సినిమా డిసాస్టర్ ప్రదర్శన పీక్స్ కి చేరిందని చెప్పాలి.
మొత్తం మీద మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 0.70Cr
?Ceeded: 7L
?UA: 9L
?East: 7L
?West: 6L
?Guntur: 10L
?Krishna: 8L
?Nellore: 4L
AP-TG Total:- 1.23CR
ఇక వరల్డ్ వైడ్ గా మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 3.66Cr
?Ceeded: 66L
?UA: 79L
?East: 48L
?West: 37L
?Guntur: 62L
?Krishna: 40L
?Nellore: 26L
AP-TG Total:- 7.24CR
?Ka & ROI: 0.68Cr
?OS: 0.94L
Total WW: 8.86CR(15Cr Gross)
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్.
సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 30.5 కోట్లకు అమ్మగా 31.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో… 22.34 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది పూర్తిగా ఆసాధ్యం కాబట్టి సినిమా టోటల్ గా డిసాస్టర్ నుండి డబుల్ డిసాస్టర్ గా పరుగును ముగించడం ఖాయంగా కనిపిస్తుంది.