ఈ సమయం లో అన్నీ సజావుగా సాగి ఉంటే, థియేటర్స్ లో కొత్త సినిమాల హంగామా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గోల గోల గా ఉండేది, మే 15 న వకీల్ సాబ్ థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చేది, కలెక్షన్స్ రిపోర్ట్స్ తో సందడి పీక్స్ లో ఉండేది, కానీ కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ఆల్ మోస్ట్ 2 నెలలకు చేరువ అవుతున్న నేపధ్యంలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా సినిమాలు అన్నీ…
ఆగిపోగా… మరో రెండు మూడు నెలల పాటు కూడా థియేటర్స్ కి వచ్చే అవకాశం లేదని తెలుస్తున్న నేపధ్యంలో పెట్టిన కోట్ల బడ్జెట్ లాక్ డౌన్ తర్వాత కూడా రికవరీ అవుతుందన్న నమ్మకం లేని సమయం ఇది, ఇలాంటి టైం లోనే స్ట్రీమింగ్ యాప్స్ ఈ సినిమాలకు… మేమున్నాం అంటూ…
థియేట్రికల్ బిజినెస్ రేంజ్ కి అటూ ఇటూ గా రేట్లు చెల్లించి సినిమాలను డైరెక్ట్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. టాలీవుడ్ తరుపు నుండి అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ డిజిటల్ రిలీజ్ కన్ఫాం అయింది. ఈ సినిమా మొత్తం మీద 25 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో…
పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది, లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయితే థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో వస్తుంది అన్ని భాషల్లో కలిపి, కానీ రికవరీ అవుతుందో లేదో ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేరు. ఇలాంటి టైం లో సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వారు ఏకంగా 26 కోట్ల రేటు చెల్లించి.
డైరెక్ట్ గా రిలీజ్ చేస్తామని ఒప్పందం జరుపుకున్నారని టాక్ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది, శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ కూడా అమ్ముకుంటే నిర్మాతలు సేఫ్ గానే ఉన్నట్లు లెక్క. దాంతో ఇలా డిజిటల్ రిలీజ్ జరుగుతుండటం చూసి టాలీవుడ్ మొత్తం షాక్ అవుతుంది… త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం….