కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన దాదాపుగా రెండున్నర నెలల నుండి థియేటర్స్ మూసేసి ఉన్నాయి, అలాగే సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దాంతో అటు సినిమా వాళ్ళు ఇటు సినిమా లు చూసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులే పడుతున్నారు. కొందరు మాత్రం ఫ్యామిలీస్ తో గడిపే టైం దక్కిందని సంతోష పడుతున్నారు. ఇక హీరోల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు మాత్రం లాక్ డౌన్ లో కూడా కష్ట పడుతున్నారట.
టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కూడా ఈ లాక్ డౌన్ వలన ఆగిపోయిన విషయం తెలిసిందే. 70% కి అటూ ఇటూ గా సినిమా షూటింగ్ పూర్తీ అవ్వగా…
ఇప్పటికీ 2 ఫైట్ సీన్స్ షూట్ జరగాల్సి ఉందట. దీనికి హీరోలు కష్టపడటానికి సంభందం ఏంటంటే… సినిమాల్లో కండలు తిరిగిన బాడీ తో కనిపించే హీరోలు, అలా కనిపించడానికి రోజు జిమ్ అండ్ డైట్ మెయిన్ టైన్ చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు రెండున్నర నెలలు గా లాక్ డౌన్ ఉండటం తో…
డైట్ విషయం లో ఇద్దరు హీరోలు షేప్ అవుట్ అయితే షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటం తో హీరోలు ఇద్దరు డైట్ అండ్ జిమ్ డైలీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారట. దాంతో లాక్ డౌన్ అయినా ఈ ఇద్దరు హీరోలకు మాత్రం ఈ డైట్ అండ్ జిమ్ తో కష్ట పడుతూనే ఉన్నారట.
లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే ఇద్దరు హీరోల తాలూకు షూట్ పూర్తిగా కంప్లీట్ అయ్యి ఉండేది, కొంత గ్యాప్ తో ఇద్దరూ కూడా కొత్త సినిమాలు మొదలు పెట్టి ఉండే వాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితుల వలన డైలీ డైట్ అండ్ జిమ్ చేస్తూ మిగిలిన టైం ఫ్యామిలీ తో గడుపుతున్నారట మన హీరోలు, ఇక ఈ నెల మూడో వారం నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు అయ్యే అవకాశం ఉందని టాక్ ఉంది…