Home గాసిప్స్ 2 ఆప్షన్స్…ఫైనల్ అయ్యేది తేలేది ఎప్పుడంటే!!

2 ఆప్షన్స్…ఫైనల్ అయ్యేది తేలేది ఎప్పుడంటే!!

298
0

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ అప్ డేట్స్ కోసం చకోర పక్షీ లా ఎదురు చూస్తూనే ఉన్నారు. బాహుబలి కి ముందు వరకు ఏడాది కి ఒక సినిమా చేసే ప్రభాస్, బాహుబలి తర్వాత ఇప్పుడు మినిమమ్ రెండేళ్ళ కో సారి కొత్త సినిమా ను యావరేజ్ గా చేస్తూ వస్తున్నాడు. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న అప్ కమింగ్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కాగా…

ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు, లాక్ డౌన్ ముందు ఫస్ట్ లుక్ త్వరలో వస్తుంది అని డైరెక్టర్ ట్వీట్ వేసినా మళ్ళీ రెండున్నర నెలలుగా ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వలేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అప్పుడప్పుడు ప్రొడక్షన్ హౌస్ ని..

ట్రోల్ చేస్తూనే ఉండగా లేటెస్ట్ గా టాలీవుడ్ టాక్ ఏంటంటే ఈ జూన్ నెల 3 వ వారం లో సినిమా అప్ డేట్ రాబోతుందని అంటున్నారు. అది కచ్చితంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్ మెంట్ అంటుండగా ఈ సినిమా కోసం ఫైనల్ రేసు లో…

2 టైటిల్స్ ఉన్నాయని, వాటి లో ఒకటి జూన్ 3 వ వారం లో ఫైనల్ అయ్యి ఫస్ట్ లుక్ లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఆ 2 టైటిల్స్ “జాన్” లేదా “రాధే శ్యామ్” లలో ఒక టైటిల్ కన్ఫాం అవుతుందని అంటున్నారు. ప్రభాస్ ఇప్పటికీ మొదట అనుకున్న జాన్ సినిమా టైటిల్ వేపే మొగ్గు చూపుతుండటం తో ఇదే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు.

దాంతో ఫ్యాన్స్ ఏది ఫైనల్ అయినా తమకి ఓకే అని అప్ డేట్ వస్తే చాలు అని ఎదురు చూస్తున్నారు. ఇక ఇది ఎంతవరకు నిజం అవుతుందో త్వరలో తెలుస్తుంది, 70% కి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఈ ఇయర్ లో వచ్చే అవకాశం ఇప్పుడు తక్కువగా ఉందని, వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ కి రావొచ్చని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here