లాక్ డౌన్ వలన పరిస్థితులు టోటల్ గా మారిపోయాయి. సినిమా రంగమే చూసుకుంటే లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ లో అనేక మార్పులు జరగబోతున్నాయి. తక్కువ క్రూ తో చాలా లిమిటెడ్ ఆర్టిస్టులతో షూటింగ్ లు నిర్వహించాలని చూస్తున్నారు. ఇక ఇతర ఇండస్ట్రీ ల నుండి నటీ నటులు ఇక్కడి కి రావడానికి పెద్దగా మొగ్గు చూపడం లేదు అదే సమయం లో మనాళ్ళు కూడా అందుకు సిద్ధంగా లేరనే చెప్పాలి.
ఇలాంటి టైం లో షూటింగ్ లు సజావుగా సాగడమే గొప్ప అందునా భారీ సెట్టింగ్ లు ఇప్పుడు వేయడం ఎక్కువ మంది తో షూట్ చేయడం అన్నది చాలా కష్టం తో కూడుకున్న విషయం. ఇలాంటి టైం లో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచే…
బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా అప్ డేట్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ లో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ఏంటంటే సినిమా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ జరుపుకునే మొదటి సినిమా, అలాగే భారీ సెట్టింగ్ అండ్ భారీ ఖర్చు తో కొన్ని సీన్స్ తీయబోతున్న సినిమా అని.
ఇప్పటికీ 70% షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లో మరో భారీ షెడ్యూల్ బాలెన్స్ ఉందట, అందులో కొన్ని సీన్స్ కి భారీ బడ్జెట్ అవసరం అని అంటున్నారు. దానికోసం ఓ భారీ సెట్ అండ్ జూనియర్ ఆర్టిస్టులు అవసరం అని అంటున్నారు. ఇందుకోసం టీం ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసి భారీ సెట్ ని వేయబోతున్నారని టాక్ ఉంది.
కానీ ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం చాలా కష్టమే అని కానీ ఆర్ ఆర్ ఆర్ భారీ బడ్జెట్ మూవీ కాబట్టి జరిగినా ఆశ్యర్యపోనవసరం లేదని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో కొన్ని రోజుల్లో తెలనున్నాయి…