Home TRP రేటింగ్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్…టీవీ లో 3 వ సారి కూడా కుమ్మింది!!

బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్…టీవీ లో 3 వ సారి కూడా కుమ్మింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన ప్రతీ రోజూ పండగే టెలివిజన్ లో కూడా కుమ్మేస్తుంది. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో చిత్రలహరి తో హిట్ కొట్టినా నికార్సయిన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూడగా చిత్రలహరి తర్వాత వెంటనే వచ్చిన ప్రతీ రోజూ పండగే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని బ్లాక్ బస్టర్ అయింది.

లాంగ్ రన్ లో ఏకంగా 34 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సాయి ధరం తేజ్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకోగా టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయిన తొలిసారి కెరీర్ బెస్ట్ TRP రేటింగ్ ని అందుకుంది.

అంతకుముందు సుప్రీమ్ సినిమా కి 14.69 TRP రేటింగ్ దక్కగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 15.33 TRP రేటింగ్ ని అందుకుని కొత్త బెస్ట్ గా నిలిచింది, రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు కొద్దిగా స్లో అయినా మళ్ళీ మూడో సారి కి మాత్రం మంచి TRP రేటింగ్ ని అందుకుంది ఈ సినిమా.

మొత్తం మీద సినిమా టెలికాస్ట్ అయిన మూడు సార్లు అందుకున్న TRP రేటింగ్ ని ఒకసారి గమనిస్తే
👉1st Time: 15.33 TRP
👉2nd Time: 4.77 TRP
👉3rd Time: 6.13 TRP
ఇదీ సినిమా మూడు సార్లు టెలికాస్ట్ అయినప్పుడు సొంతం చేసుకున్న TRP రేటింగ్ లు. రెండో సారి కొద్దిగా స్లో అయినా కానీ మూడో సారి మళ్ళీ కుమ్మింది ఈ సినిమా.

ఇక ఈ సినిమా విజయం తర్వాత మెగా మేనల్లుడు ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లాక్ డౌన్ తర్వాత మంచి డేట్ చూసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది, ఈ సినిమాతో హాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు సాయి ధరం తేజ్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here