లాక్ డౌన్ వల్ల సినీ ఇండస్ట్రీ కి గట్టి ఎదురుదెబ్బే తగిలింది అని చెప్పాలి, మార్చి రెండో వారం నుండే థియేటర్స్ మూత పడ్డాయి, ఇప్పుడు జూన్ లో ఎంటర్ అయినా ఎప్పుడు తెరుచుకుంటాయో అన్నది క్లారిటీ లేకుండా పోయింది, ఇలాంటి టైం లో మిగిలినవన్నీ అన్ లాక్ 1 పేరుతో ఓపెన్ చేసినా కానీ సినిమా థియేటర్స్ విషయం లో మాత్రం ప్రభుత్వాలు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నాయి. మరో….
రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉందని అంటుండగా ఇలాంటి టైం లో థియేటర్స్ ఓపెన్ చేశాక జనాలు థియేటర్స్ వస్తారో రారో అన్న డౌట్ కూడా ఉండగా వాళ్ళు మునుపటి లా రావాలి అంటే పెద్ద హీరో సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
అందులో భాగంగా కోలివుడ్ లో థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ ని రిలీజ్ చేయాలని నిర్మాతలు చాలా మంది కోరుకోగా… లేటెస్ట్ గా కొందరు నిర్మాతలు మాత్రం సినిమా ను ఇప్పుడే అస్సలు రిలీజ్ చేయొద్దు అని ముఖ్యమంత్రి కి లెటర్ రాశారట.10 కోట్ల సీనయ్య…షాకింగ్ అప్ డేట్!!
విజయ్ సినిమా అంటే జనాలు లెక్క లేకుండా థియేటర్స్ కి విరగబడి వస్తారని, దాని వల్ల ఒక్క కరోనా పాజిటివ్ పేషెంట్ ఎంతో మంది కి ఈ వైరస్ ని అంటించే అవకాశం ఉందని, దాని వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్టర్ ని రిలీజ్ అవ్వొద్దు అని లేఖ రాశారని సమాచారం.11 ఏళ్లలో ఇది 2 వ సారి మాత్రమే ఇలా జరిగింది!!
దీని పై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి, జనాలు చిన్న చితకా సినిమా ల కోసం థియేటర్స్ కి ఇప్పుడు వచ్చేలా లేరని, వారు రావాలి అంటే పెద్ద హీరో సినిమా రిలీజ్ అవ్వాల్సిందే నని అంటున్నారు. మరి ఫైనల్ గా ఎవరి మాట నిజం అవుతుందో సినిమా యూనిట్ ఏం ఫిక్స్ అవుతారో త్వరలో తేలుతుంది…సూపర్ హిట్ మూవీ…మళ్ళీ రీ రిలీజ్…ఎక్కడో తెలుసా??