బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్ లో ఎం ఎస్ ధోని బయోపిక్ లో ధోని ని మరిపించే నటనతో మెప్పించిన సుశాంత్ లాస్ట్ ఇయర్ చిచోరే సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా లో… ఆత్మహత్య అన్నింటికీ పరిష్కారం కాదని అందరికీ సందేశం ఇచ్చిన నటుడే ఇప్పుడు డిప్రెషన్ కి లోను అయ్యి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని…
పోలీసులు ప్రాథమిక ఇంటరాగేషన్ లో తెలియజేశారు. ఒక్క సారిగా సోషల్ మీడియా మొత్తం సుశాంత్ సింగ్ మరణ వార్తా విని షాక్ కి గురి అయ్యారని చెప్పాలి. కేవలం 34 ఏళ్ల వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంత ఒత్తిడి ఉన్నా కానీ సమంజసం కాదనే చెప్పాలి.
రీసెంట్ గా తన మ్యానేజర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం, ఆ కేసు కి ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య కి లింక్ ఏంటని పోలీసులు ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తున్నారట. బాలీవుడ్ కూడా ఒక మంచి యువ నటుడిని కోల్పోయినందుకు షాక్ లో ఉండగా.. 2020 లో ఇలాంటి మరెన్ని భాదాకరమైన వార్తలు వినాల్సి వస్తుందని అందరూ చింతిస్తున్నారు..
OMG ! unbelievable .. great loss