Home గాసిప్స్ బ్లాక్ బస్టర్ రీమేక్…అఖిల్ నో అన్నాడు…విశ్వక్ సేన్ ఓకే అన్నాడు!!

బ్లాక్ బస్టర్ రీమేక్…అఖిల్ నో అన్నాడు…విశ్వక్ సేన్ ఓకే అన్నాడు!!

0

హీరోగా 2015 వి వి వినాయక్ డైరెక్షన్ లో అఖిల్ సినిమా తో లాంచ్ అయ్యాడు అక్కినేని అఖిల్, డెబ్యూ మూవీ తో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందు కున్నా కానీ సినిమా టాక్ వల్ల భారీ ఫ్లాఫ్ ని మూట గట్టుకున్నాడు, తర్వాత చేసిన హలో సినిమా , ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను సినిమా లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ గానే మిగిలి పోవడం తో….

సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు అఖిల్ అక్కినేని… ఈ క్రమం లో ఇప్పుడు బొమ్మరిల్లు పరుగు తర్వాత హిట్ లేని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న అఖిల్ ఈ సినిమా పైనే ఆశలు అన్నీ పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ కి మీడియం రేంజ్ నుండి మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ కథలు చెబుతున్నా ఏవి ఇంకా ఫైనల్ చేయలేదు, అదే సమయం లో ఇతర ఇండస్ట్రీ లలో సూపర్ హిట్ మూవీస్ రీమేక్ ఆఫర్స్ ని కూడా రిజల్ట్ చేస్తున్నాడట. ఈ ఇయర్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన మూవీస్ లో…

ఓ మై కడవులే అనే లవ్ స్టొరీ కూడా ఒకటి, చిన్న సినిమానే అయినా అద్బుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ PVP వాళ్ళు తీసుకోగా అఖిల్ ని అప్రోచ్ అవ్వగా ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ కి నో చెప్పాడట. ఇక అఖిల్ తర్వాత ఈ రీమేక్ రీసెంట్ గా ఫలక్నుమా దాస్ అండ్ హిట్ మూవీస్ తో…

వరుస హిట్స్ కొట్టి జోష్ మీదున్న విశ్వక్ సేన్ దగ్గరకు వెళ్ళగా, కథ నచ్చి వెంటనే రీమేక్ కి ఓకే చెప్పాడట విశ్వక్ సేన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఓ మై కడవులే అఖిల్ కి బాగానే సెట్ అయ్యేది కానీ నో చెప్పడం తో ఇప్పుడు విశ్వక్ సేన్ ఖాతాలో మరో మంచి విజయం పడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here