స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టర్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ పుష్ప పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే, ఒక వైపు అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సినిమా తో సెన్సేషన్ ఇండస్ట్రీ హిట్ కొట్టగా మరో వైపు సుకుమార్ కూడా రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టగా ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న పుష్ప క్రేజ్ పీక్స్ లో ఉంది.
అందరికీ షాక్ ఇస్తూ పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే తిరిగి మొదలు అవ్వాల్సి ఉన్నా కానీ లోకేషన్స్ వలన ఆగిపోతుంది, దానికి కారణం సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అడవిలో షూట్ ఉండగా, అల్లు అర్జున్…
లారీ డ్రైవర్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే, అందుకే కేరళ అడవుల్లో షూట్ అనుకున్నారు కానీ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన ఆగిపోయారు, మళ్ళీ అక్కడి దాకా ఎందుకు మన ఆంధ్రా సైడ్ ఉన్న అడవుల్లో షూట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు కానీ… ఇక్కడ కూడా కరోనా ఇప్పుడు రెచ్చి పోతుండటం తో….
మరింత కాలం ఆగాలా లేక మరో ప్రత్యామ్నాయం చూడాలా అని వెతుకుండగా… ఇక ఇవి సెట్ కావు కానీ హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న అడవి లాంటి చెట్లలో తక్కువ క్రూ తో షూటింగ్ చేయడం ఉత్తమం అని ఫిక్స్ అయ్యారట యూనిట్. ఇప్పుడు వాటి పనులే జరుగుతున్నాయని త్వరలోనే అక్కడే సినిమా షూటింగ్…
తిరిగి మొదలు అవుతుందని అంటున్నారు. దాంతో ఇక సినిమా షూటింగ్ ఇండోర్ లోనే స్పెషల్ సెట్స్ లో తక్కువ క్రూ తో జరిగే అవకాశం ఉంది. కాగా సినిమా ఈ ఏడాది వచ్చే చాన్స్ లేదని వచ్చే ఇయర్ సమ్మర్ రేసు లో సినిమా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇద్దరూ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన జోష్ లో ఉండగా ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి..