Home గాసిప్స్ వరుణ్ తేజ్ తో అనుకుంటే…రామ్ తో కన్ఫాం అయ్యింది!!

వరుణ్ తేజ్ తో అనుకుంటే…రామ్ తో కన్ఫాం అయ్యింది!!

0

ఒకరితో అనుకున్న సినిమా లు మరొకరితో కన్ఫాం అవ్వడం సర్వసాధారణంగా జరిగేవే… టాలీవుడ్ లో అడపా దడపా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేటెస్ట్ గా మరో సినిమా ముందు ఒక హీరో దగ్గరికి వెళ్ళగా అది అక్కడే ఆగిపోయి మరో హీరో దగ్గరకి వెళ్లి కన్ఫాం కూడా అయ్యింది అని లేటెస్ట్ గా టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని గట్టిగానే చెబుతున్నారు..

రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సరికొత్త సినిమా ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందని వార్తలు శిఖారు చేశాయి. కానీ ఎందుకనో చివరి నిమిషం లో ఇప్పుడు ఆ సినిమా వరుణ్ తేజ్ నుండి రామ్ కి వెళ్లిందని సమాచారం….

కారణాలు ఏంటని క్లియర్ గా తెలియకున్నా కానీ ప్రస్తుతం వరుణ్ తేజ్ అప్ కమింగ్ బాక్సింగ్ మూవీ షూటింగ్ లాక్ డౌన్ వలన పెండింగ్ ఉండటం తో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కి మరింత సమయం పట్టే అవకాశం ఉండగా, ఇటు రామ్ ఇప్పటికే సమ్మర్ కానుకగా…

రిలీజ్ చేయాలి అనుకున్న రెడ్ మూవీ ని కంప్లీట్ చేసి ఖాళీ గా ఉండటం తో ముందు సురేందర్ రెడ్డి రామ్ ని కలవడం కథ చెప్పడం దానికి రామ్ కూడా ఓకే అనడం జరిగింది అని టాక్ ఇండస్ట్రీ లో ఉంది, ఇదే చాలా వరకు నిజం అని కూడా అంటున్నారు, రామ్ తో సినిమా తర్వాత…

వరుణ్ తేజ్ మరియు సురేందర్ రెడ్డి ల సినిమా ఉంటుందని అంటున్నారు…. దీనికి బలం చేసే మరో వార్తా… రామ్ సురేందర్ రెడ్డి సినిమాలకు ఇంకా నిర్మాత ఫిక్స్ కాలేదు, అదే సమయం లో వరుణ్ తేజ్ తో అనుకున్నప్పుడు డైరెక్టర్ క్రిష్ నిర్మాణం లో వస్తుందని న్యూస్ వచ్చింది. సో సురేందర్ రెడ్డి మొదట రామ్ తో సినిమా చేసి తర్వార వరుణ్ తేజ్ తో సినిమా చేయవచ్చని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here