ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మొదలు అయ్యి చాలా కాలమే అయింది, అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా ఈ ఇయర్ జులై ఎండింగ్ లో రిలీజ్ అవ్వాల్సింది, వచ్చే ఏడాది సంక్రాంతి కి పోస్ట్ పోన్ అయిన విషయం అందరి కీ తెలిసిందే.
ఇక కరోనా ఎఫెక్ట్ వలన షూటింగ్ లు అన్నీ ఆగిపోవడం తో సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని సమ్మర్ రేసు లో ఎంటర్ అయ్యింది. ఇక లాక్ డౌన్ ముగిసే టైం కి ఇండస్ట్రీ పెద్దలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి షూటింగ్స్ కోసం పర్మీషన్లు తీసుకోగా…
అన్ని సినిమా ల కన్నా ముందు టెస్ట్ షూట్ తో మొదలు అయిన ఆర్ ఆర్ ఆర్ అనుకున్న విధంగా షూటింగ్ జరగలేదట. తక్కువ క్రూ తో షూట్ జరిపి గ్రాఫిక్స్ లో వాటిని మ్యానేజ్ చేద్దామని ప్లాన్ చేసినా కానీ అది యూనిట్ అనుకున్నట్లు రావడం లేదట.
దానికి తోడూ కరోనా ఇంకా ఎక్కువగా రెచ్చిపోతుండటం తో ఎవరికి ఎప్పుడు ఎం జరిగేది చెప్పలేని పరిస్థితి కనుక మరింత కాలం షూటింగ్ పోస్ట్ పోన్ చేసి అనుకున్న విధంగానే సినిమా ను షూటింగ్ చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో కరోనా తగ్గే వరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మళ్ళీ మొదలు అవ్వడం కష్టమే నని…
ఒకవేళ మొదలు అయినా ఇద్దరు హీరోల సింగిల్ షాట్స్ మాత్రమె చిత్రీకరించే అవకాశం ఉందని అంటున్నారు. ఒక్క ఆర్ ఆర్ ఆర్ అని కాదు, చాలా సినిమాల షూటింగ్ కూడా కరోనా ఎఫెక్ట్ తగ్గక పోవడం తో షూటింగ్ పర్మీషన్ వచ్చినా కూడా పరిస్థితులు సద్దుకున్నాకే షూటింగ్ చేయాలనీ ఆగుతున్నారు. మరి ఈ ఎఫెక్ట్ వలన రిలీజ్ డేట్ మరోసారి మారుతుందా లేదా చూడాలి…