బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో క్లీన్ హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న హీరోల్లో కింగ్ నాగార్జున కూడా ఒకరు. సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సూపర్ హిట్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన ఇతర సినిమాలు అన్నీ అంచనాలు అందుకోలేదు, ముఖ్యంగా ఆఫీసర్ సినిమా అలాగే మన్మథుడు 2 సినిమా లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్లు గా నిలిచి భారీ దెబ్బతీశాయి.
ఇలాంటి టైం లో కమర్షియల్ మూవీ చేస్తాడు అనుకుంటే వైల్డ్ డాగ్ అనే పోలిస్ ఇన్వెస్టిగేషన్ మూవీ చేస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ మొదలు పెడతాడు అనుకుంటే ఆ సినిమా ను పక్కకు పెట్టి వేరే సినిమాలను కమిట్ అవుతున్నాడు.
రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్నాడని వార్తలు రాగా ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా రీమేక్ లో నటించడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం. 2018 లో బాలీవుడ్ లో అజయ్ దేవగన్ మరియు ఇలియానా ల కాంబినేషన్ లో వచ్చిన రైడ్ మూవీ ని అప్పట్లోనే తెలుగు లో రీమేక్ చేయాలి అనుకున్నారు.
కానీ ఎందుకనో ఆగిపోయింది, సూర్య నటించిన గ్యాంగ్ సినిమా కథ లో ఉండే ఈ సినిమా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో మెప్పిస్తుంది. హిందీ లో 102 కోట్ల కి పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. అలాంటి సినిమా ను తెలుగు లో కొంచం మార్పులు చేర్పులు చేసి ఎంటర్ టైన్ మెంట్ కూడా జోడించి…
రీమేక్ చేస్తే బాగుంటుందని నాగార్జున భావిస్తున్నారని సమాచారం. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అన్నది చెప్పలేం కానీ సీరియస్ మూవీ అయినా ఉన్నది ఉన్నట్లు తీస్తే స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో తెలుగు లో వర్కౌట్ అయ్యే చాన్స్ ఉంది. మరి మార్పులు చేర్పులు చేస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా రీమేక్ పై మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు…