ఒకే కాన్సెప్ట్ తో రెండు డిఫెరెంట్ సినిమాలు తెరకేక్కడం అన్నది అప్పుడూ జరుగుతూ ఉంటుంది, అనుకోని జరిగి ఉండొచ్చు అనుకోకుండా జరిగి ఉండొచ్చు కానీ అప్పుడప్పుడు సినిమా లో మెయిన్ థీం పాయింట్ అప్పుడప్పుడు రెండూ సినిమాల కు కలుస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఓ బేబీ ఈ ఇయర్ వచ్చిన డిస్కో రాజా కథ మూల పాయింట్ సెం కానీ ట్రీట్ మెంట్ డిఫెరెంట్… ఇక 2015 లో వచ్చిన…
పటాస్ మరియు టెంపర్ సినిమాలలో మెయిన్ థీం ఒకటే కానీ ట్రీట్ మెంట్ మాత్రం డిఫెరెంట్… ఇలా కొన్ని సినిమాల కథ పాయింట్స్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే… ఇద్దరు టైర్ 2 హీరోల అప్ కమింగ్ సినిమాల…
కథ పాయింట్ థీం ఒకటేనని అంటున్నారు. రెండూ కూడా బాక్సింగ్ నేపధ్యం లో తెరకెక్కుతున్న సినిమా లే కాగా రెండింటి లో కూడా మదర్ సెంటిమెంట్ మీదే ఉంటాయని టాక్ ఉంది. ఆ రెండు సినిమాలే వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సింగ్ మూవీ అండ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫైటర్ మూవీ అంటున్నారు.
రెండు సినిమాల్లో కూడా కథ పాయింట్ కొంచం అటూ ఇటూగా ఒకేలా ఉంటాయని అంటున్నారు, కానీ ట్రీట్ మెంట్ మాత్రం కొంచం డిఫెరెంట్ గా ఉంటుందని, విజయ్ దేవరకొండ ఫైటర్ కొంచం సీరియస్ నోట్ తో ఉండే సినిమా అని, అలాగే వరుణ్ తేజ్ బాక్సింగ్ మూవీ కమర్షియల్ మూవీ అని ఇండస్ట్రీ లో టాక్ ఉంది.
ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ఈ రెండు సినిమాలు కూడా ఇది వరకు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతున్న సినిమా అని కానీ ఇప్పటి జనరేషన్ ని తగ్గట్లు ఇందులో మార్పులు చేర్పులు చేశారు అంటున్నారు. మరి ఇవి ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి…