యంగ్ హీరోల్లో మంచి టాలెంట్ ఉండీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్న హీరోల్లో నాగశౌర్య కూడా ఒకరు. కెరీర్ ని ఎప్పుడో మొదలు పెట్టి ఆల్ మోస్ట్ 19 సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో అందులో బిగ్గెస్ట్ హిట్ ని రెండేళ్ళ క్రితం ఛలో సినిమా తో సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఇక తన లైఫ్ టర్న్ అవుతుంది అనుకున్నా కానీ..
ఎంచుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో తన మార్కెట్ మెల్లి మెల్లిగా తగ్గుతూ రాగా ఈ ఏడాది జనవరి ఎండ్ లో తన నిర్మాణంలోనే అశ్వద్దామ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నా కానీ..
సంక్రాంతి సినిమాల లాంగ్ రన్ జోరు వల్ల ఈ సినిమా హిట్ అవ్వలేక పోయింది. ఇలాంటి టైం లో కరోనా ఎఫెక్ట్ తో అందరూ ఇళ్లకే పరిమితం అవ్వగా నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో అందరికీ షాక్ ఇచ్చాడు, ఎందుకోసమా అని అందరూ అనుకుంటూ ఉండగా…
తన కెరీర్ లో 20 వ సినిమా గా రూపొందుతున్న కొత్త సినిమా కోసం ఈ లుక్ లోకి వచ్చాడు నాగశౌర్య. బాడీ టోటల్ గా ట్రాన్స్ ఫార్మ్ అవ్వగా తన న్యూ లుక్ ఆకట్టుకుందని చెప్పాలి. ఆర్చరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి నార్త్ స్టార్ ప్రొడక్షన్ లో శరద్ మరార్ నిర్మాణంలో… సుబ్రమణ్యపురంను తెరకెక్కించిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో…
రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయగా టైటిల్ ని ఇంకా కన్ఫాం చేయాల్సి ఉంది. కానీ టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా కి పార్దు అనే టైటిల్ ని అనుకుంటున్నారని సమాచారం… మరి ఈ సినిమా తో అయినా నాగశౌర్య కెరీర్ లో బిగ్గెస్ట్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి..