మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు, అజ్ఞాతవాసి డిసాస్టర్ అయినా కానీ త్రివిక్రమ్ మార్కెట్ పై ఎలాంటి ఇంపాక్ట్ పడలేదు, అరవింద సమేత మరియు అల వైకుంఠ పురం లో సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపిన త్రివిక్రమ్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే…
ఈ పాటికే షూటింగ్ మొదలు అవ్వాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఇంకా మొదలు అవ్వాల్సి ఉండగా ఇప్పుడు ఈ ఇయర్ చివర్లో సినిమా మొదలు కాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా కి గాను త్రివిక్రమ్ తీసుకునే రెమ్యునరేషన్ వివరాలు…
ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది వరకు సినిమాకి సుమారు 12 కోట్ల నుండి 15 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకునే త్రివిక్రమ్ ఇప్పుడు అల వైకుంఠ పురం లో ఇండస్ట్రీ హిట్ తర్వాత తన రెమ్యునరేషన్ ని మరింత పెంచాడని అంటున్నారు. ఆ లెక్కల ప్రకారం సినిమా కి రెమ్యునరేషన్ తో పటు సినిమా ఓవరాల్ గా…
సాధించే బిజినెస్ అండ్ ప్రాఫిట్ కలిపి అందులో షేర్ తీసుకోబోతున్నాడట. అంటే రెమ్యునరేషన్ కింద 15-16 కోట్ల రేంజ్ అమౌంట్ ని అందుకోకున్న త్రివిక్రమ్ బిజినెస్ అండ్ ప్రాఫిట్ లో 5-8% వరకు వాటాని రెమ్యునరేషన్ గా తీసుకుంటాడని సమాచారం. అంటే అవలీలగా తన అప్ కమింగ్ మూవీ అయిన ఎన్టీఆర్30 కి గాను త్రివిక్రమ్ ఇప్పుడు తక్కువలో తక్కువ…
20 కోట్ల నుండి 22 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకోబోతున్నడన్న మాట. ఇదే కనుక నిజం అయితే టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత 20 కోట్ల మార్క్ రెమ్యునరేషన్ ని అందుకున్న డైరెక్టర్ గా త్రివిక్రమ్ నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్30 స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉండగా త్వరలోనే సినిమా కథని ఎన్టీఆర్ కి కంప్లీట్ నరేషన్ ఇవ్వబోతున్నాడట త్రివిక్రమ్..