Home న్యూస్ 30 కోట్ల సినిమా…35 కోట్లు అనుకుంటే…ఫైనల్ రేటు ఇదే!

30 కోట్ల సినిమా…35 కోట్లు అనుకుంటే…ఫైనల్ రేటు ఇదే!

0

లేడీ సూపర్ స్టార్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి టాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే, అరుంధతి తో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న అనుష్క తర్వాత ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ రాగా వాటిలో కూడా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలుగా నిలిచాయి. రీసెంట్ టైం లో భాగమతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా…

తర్వాత అనుష్క పాన్ ఇండియా లెవల్ లో చేసిన సినిమా నిశ్శబ్దం. హిందీ తో పాటు మిగిలిన సౌత్ భాషల్లో రూపొందిన ఈ సినిమా ను సుమారు 30 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించగా సినిమా సమ్మర్ రేసులో నిలవాల్సి ఉన్నా కరోనా వల్ల పోస్ట్ పోన్ అవ్వగా…

అప్పుడే సినిమా కి 26 కోట్ల రేంజ్ డిజిటల్ రిలీజ్ ఆఫర్లు రాగా యూనిట్ పెద్దగా పట్టించుకోలేదు, కానీ తర్వాత సినిమా బడ్జెట్ 30 కోట్లు కాబట్టి 35 కోట్ల రేంజ్ డీల్స్ వస్తే చూద్దాం లే అనుకుని లైట్ తీసుకోగా ఈ లోపు ఉన్న రేటు ఆఫర్లు క్రేజ్ కూడా తగ్గుతూ వచ్చాయి.

ఇప్పుడు ఆ రేటు రాలేదు సరికదా ముందు అనుకున్న రేటు కూడా తగ్గి సినిమా హిందీ కాకుండా మిగిలిన భాషల డిజిటల్ రిలీజ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 23 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారట. హిందీ హక్కుల విషయం ఇంకా బయటికి క్లియర్ గా రిలీజ్ కాలేదు. ఇక సినిమా ను అక్టోబర్ రెండో వారం లో కానీ లేదా..

మూడో వారం లో కానీ డైరెక్ట్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమచారం. యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ అయిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ డిజిటల్ రేటు ప్రకారం చూసుకుంటే మంచి రేటు దక్కిందనే చెప్పాలి, కానీ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే శాటిలైట్ రైట్స్ పై ఇప్పుడు సినిమా ఆధారపడబోతుంది అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here