Home గాసిప్స్ 21 నుండి ఇప్పుడు రేటు పెరిగింది…రామ్ తగ్గేది లేదు అంటున్నాడు!

21 నుండి ఇప్పుడు రేటు పెరిగింది…రామ్ తగ్గేది లేదు అంటున్నాడు!

0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోగా తర్వాత చేసిన సినిమా రెడ్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడం సినిమా ను తెలుగు లో రెడ్ పేరు తో రీమేక్ చేయగా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా సినిమా కి అప్పట్లో సాలిడ్ గా…

డిజిటల్ రిలీజ్ కోసం ఆఫర్లు రాగా, అప్పుడు యూనిట్ ఆ ఆఫర్స్ కి నో చెబుతూ వచ్చింది, రేటు 23 కోట్ల నుండి మొదలు అయ్యి 28 కోట్ల రేంజ్ హై కి కూడా చేరుకోగా, టీం మాత్రం సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ అనుకున్నారు కానీ…

తర్వాత వి మూవీ డిజిటల్ రిలీజ్ తర్వాత అన్ని సినిమాలు కూడా డిజిటల్ రిలీజ్ వైపే మొగ్గు చూపగా OTT యాప్స్ రేట్లు తగ్గించడం మొదలు పెట్టాయి. ఆ ఎఫెక్ట్ రామ్ రెడ్ మూవీ కి కూడా పడి 21 కోట్ల రేటు మాత్రమే ఇస్తామని చెప్పగా రామ్ కి కోపం వచ్చి ఈ ఆఫర్స్ కి నో చెప్పాడు.

ఇక రీసెంట్ గా మళ్ళీ సినిమా కి రేటు పెరిగి ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ సారి రేటు 24 కోట్ల రేంజ్ లో చెప్పగా సీన్ లోకి రామ్ ఎంటర్ అయ్యి ఈ ఆఫర్స్ ఎన్ని వచ్చినా ఇప్పుడు సినిమా ను అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నామని కన్ఫాం చేశాడట. దాంతో పాటు సినిమా రిలీజ్ ని కూడా కన్ఫాం చేశాడు….

అని టాక్ గట్టిగా వినిపిస్తుంది. థియేటర్స్ రీ ఓపెన్ వచ్చే నెలలో అయితే రెడ్ సినిమాను ఇయర్ ఎండ్ క్రిస్టమస్ కానుకగా గానీ లేదా సంక్రాంతి కి గాని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నామని కన్ఫాం చేశాడట. దాంతో OTT వాళ్ళు వెళ్లిపోయారట. ఇక సినిమా డిజిటల్ రిలీజ్ ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆల్ మోస్ట్ థియేటర్స్ లోనే కన్ఫాం అనుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here