Home గాసిప్స్ నెల టైం….2 ఇద్దరి కోసం వెతుతుకున్న బోయపాటి!

నెల టైం….2 ఇద్దరి కోసం వెతుతుకున్న బోయపాటి!

2

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో సింహా మరియు లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రాగా ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ కూడా పెద్దగా ఫామ్ లో లేరన్న విషయం తెలిసిందే. బాలయ్య లాస్ట్ ఇయర్ వరుసగా 3 ఫ్లాఫ్ మూవీస్ ని సొంతం చేసు కుని…

హాట్రిక్ ఫ్లాఫ్స్ ని కంప్లీట్ చేయగా… బోయపాటి కూడా సరైనోడు తర్వాత క్లీన్ హిట్ కొట్టాల్సి ఉంది. ఇద్దరూ హిట్స్ లో లేకున్నా కానీ వీళ్ళ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు పెరగగా ఇప్పటికే ఒకటి అరా షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న…

ఈ సినిమా కి అతి ముఖ్యమైన విలన్ అలాగే హీరోయిన్ మాత్రం ఇంకా కన్ఫాం అవ్వాల్సి ఉంది. విలన్ గా అనేక మంది యంగ్ యాక్టర్స్ నుండి బాలీవుడ్ లో సంజయ్ దత్ వరకు అనుకోగా హీరోయిన్ గా అంజలి, శ్రేయ, నయనతార ఇలా చాలా మందినే అనుకున్నారు…

కానీ ఎవ్వరూ ఫైనల్ అవ్వలేదని సమాచారం… విలన్ విషయం లో బాలయ్య ని ఢీ కొట్టే వ్యక్తి కోసం వెతుకులాట కొనసాగుతూనే ఉండగా హీరోయిన్ ని మాత్రం ఇప్పుడు ఎవ్వరూ సెట్ అవ్వకపోతే… కొత్త హీరోయిన్ ని లాంచ్ చేసే ఆలోచనలో బోయపాటి ఉన్నారని అంటున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో జరుగుతుందని అంటున్నారు.

అప్పటి వరకు ఇటు మెయిన్ విలన్ రోల్ కి అలాగే హీరోయిన్ రోల్ కి యాక్టర్స్ ని కన్ఫాం చేయాలని బోయపాటి బిజీగా ఉన్నారని తెలుస్తుంది. సినిమా పై మంచి బజ్ ఉన్న నేపధ్యంలో సినిమా షూటింగ్ అనుకున్నట్లు మొదలైతే సింగిల్ షెడ్యూల్ లో పూర్తి అయితే సినిమా సంక్రాంతి రేసు లోకి ఎంటర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here