Home గాసిప్స్ ఫస్ట్ సినిమా డిసాస్టర్…2వ సినిమా 3 కోట్ల బడ్జెట్ కి OTT బిజినెస్ తెలిస్తే షాక్

ఫస్ట్ సినిమా డిసాస్టర్…2వ సినిమా 3 కోట్ల బడ్జెట్ కి OTT బిజినెస్ తెలిస్తే షాక్

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా దొరసాని బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అయ్యి డిసాస్టర్ అయిన విషయం తెలిసిందే. సినిమా కి మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ రాగా 2.6 కోట్ల బిజినెస్ కి ఆ సినిమా మొత్తం మీద 1.29 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా కి బడ్జెట్ 4.5 కోట్ల రేంజ్ లో పెట్టగా మొత్తం మీద లాస్ చాలా ఎక్కువే వచ్చింది అని చెప్పాలి… కానీ తన రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడిస్ కూడా మంచి బడ్జెట్ తో తీయగా సినిమా కరోనా లేకుండా ఉంటె…

ఆడియన్స్ ముందుకు వచ్చి ఉండేది కానీ కరోనా వలన రిలీజ్ ఆగిపోయి ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపు సిద్ధం అవుతుంది…ఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 20 న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయ బోతున్నారు. కాగా ఈ సినిమా కి అద్బుతమైన రేటు దక్కినట్లు చెబు తున్నారు.

సుమారు 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లోపే తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం 4.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి డిజిటల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయినా కానీ ఈ సినిమా కి ఓవరాల్ గా సాలిడ్ రేటు దక్కింది అని చెప్పొచ్చు.

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటె పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బడ్జెట్ పై ఇప్పటికే కోటిన్నర రేంజ్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఇక శాటిలైట్ రైట్స్ తో ఎంత వస్తే అంత మరింత ప్రాఫిట్ లో యాడ్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here