టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాస్ట్ ఇయర్ వినయ విదేయ రామ సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేసిన తర్వాత పూర్తీ టైం ని ఆర్ ఆర్ ఆర్ సినిమా కే కేటాయించిన విషయం తెలిసిందే, ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర అయిపోగా మరింత సమయం కూడా ఈ సినిమా కే వెళ్ళబోతుంది, ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది ఇప్పటి వరకు కూడా…
అఫీషియల్ గా అయితే ఎలాంటి అప్ డేట్ లేదు కానీ ఆల్ మోస్ట్ ప్రాజెక్ట్ మాత్రం కన్ఫాం అయింది అని టాక్ గట్టిగా స్ప్రెడ్ అయింది అని చెప్పాలి. కోలివుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో రామ్ చరణ్ తెలుగు తమిళ్ బైలింగువల్ లో నటించబోతున్నారని అంటున్నారు.
కానీ ఆ బైలింగువల్ పై ఒక్కో రోజు ఒక్కో వార్తా వస్తుండగా లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ బైలింగువల్ 2016 రామ్ చరణ్ చేసిన ధృవ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా అని అంటున్నారు. తమిళ్ ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా…
ఇప్పుడు సీక్వెల్ ని రెండు చోట్ల రామ్ చరణ్ తో డైరెక్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు. అలా జరగడానికి మంచి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇంత తక్కువ టైం లో రామ్ చరణ్ ని ఒప్పించడం మరే డైరెక్టర్ వలన అయితే కాలేదు, కానీ మోహన్ రాజా చేశాడు అంటున్నారు కాబట్టి సీక్వెల్ కథ పకడ్బందీగా సెట్ అవ్వడమే రీజన్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ దీనిపై ఇంకా అఫీషియల్ అప్ డేట్ అయితే రావాల్సి ఉండగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ నుండి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఓ పాన్ ఇండియా మూవీ రావాలని కోరుకుంటున్నారు. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరిక మన్నించి పాన్ ఇండియా మూవీ చేస్తాడా లేక ఈ బైలింగువల్ మూవీ నే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా చూడాలి.