Home న్యూస్ “సైకో” రివ్యూ….ఇదేమి సినిమా రా బాబు!!

“సైకో” రివ్యూ….ఇదేమి సినిమా రా బాబు!!

0

వేసిన సినిమా లే మళ్ళీ మళ్ళీ టెలివిజన్ లో వేస్తూ ఉండటం తో లేటెస్ట్ గా స్టార్ మా ఛానెల్ శాటిలైట్ రైట్స్ అమ్మకం జరగని సినిమాలను టెలికాస్ట్ చేస్తూ వస్తుండగా రీసెంట్ గా మరో కొత్త పద్దనితి జెమినీ టీవీ ఇంట్రోడ్యూస్ చేసింది, తమిళ్ మూవీస్ ని తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేయగా… ఇప్పుడు స్టార్ మా కూడా అలానే ఈ ఇయర్ తమిళ్ లో సైకో థ్రిల్లర్ జానర్ లో వచ్చిన…

సైకో అనే మూవీ ని తెలుగు లో డబ్ చేసి రీసెంట్ గా టెలివిజన్ లో డైరెక్ట్ రిలీజ్ చేసింది….ఓకే ఓకే ఫేం ఉదయనిధి స్టాలిన్ హీరోగా అదితి రావ్ హైదరీ, మరియు నిత్యామీనన్ లు ముఖ్య రోల్స్ చేసిన ఈ సినిమా టెలివిజన్ లో డైరెక్ట్ రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే… అన్ని సైకో థ్రిల్లర్ మూవీస్ లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఒక సైకో అమ్మాయిలను చంపుతూ ఉంటాడు, తనని పట్టుకోలేక పోలీసులు ఏం చేయలేక పోతూ ఉంటారు… మరో పక్క అంధుడైన హీరో రేడియో జాకీ అయిన హీరోయిన్ ని లవ్ చేస్తాడు…

కానీ హీరోయిన్ తనని ప్రేమించను అంటూనే ప్రేమలో పడ్డ టైం లో సైకో హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తాడు… మరి హీరోయిన్ ని చంపెశాడా… అందుడైన హీరో సైకో ని పట్టుకున్నాడా లేదా అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్… పెర్ఫార్మెన్స్ పరంగా లీడ్ రోల్ చేసిన అందరూ కూడా బాగా నటించి మెప్పించారు.

తెలుగు డబ్బింగ్ బాగుంది, సౌండింగ్ అదిరిపోతుంది… బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది… స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ చాలా స్లోగా రిపీటివ్ గా అనిపిస్తాయి… సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి. ఇక డైరెక్టర్ మిస్కిన్ ఇది వరకు పిశాచి… డిటెక్టివ్ లాంటి మూవీస్ తో తెలుగు లో పరిచయం ఉన్న డైరెక్టరే…

ఈ కథ ను చాలా డిఫెరెంట్ గా తీశారు కానీ సినిమా లో సైకో అలా ఎందుకు మారాడు అన్నది ఫ్లాష్ బ్యాక్ లేకుండా చేశారు… ఎందుకు తలలను మాత్రమే నరుకుతున్నాడు లాంటివి ఏమి చెప్పలేదు… బిగ్ షాట్ అయినా అలా సింపుల్ గా చంపడం పోలీసులకు అస్సలు చిక్కకపోవడం…

ఏమాత్రం లాజిక్ ఉండవు, సీన్ బై సీన్ అలా వస్తూ ఉంటాయి, చాలా సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి… కానీ సైకో మోటో ఏంటో తెలియక పోవడం తో పెద్దగా కనెక్ట్ కాలెం… ఎటొచ్చి ఒక అందుడైన హీరో సైకోని ఎలా కనిపెడతాడు అన్న ఆసక్తి తప్పితే సినిమాలో పెద్దగా ఆసక్తి రేపిన అంశాలు ఏమి లేవు.

ఇక క్లైమాక్స్ లో సైకో ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉండటం… ప్రెస్ మీట్ లో హీరోయిన్ కామెంట్స్ కి సైకో చేసిన పనికి ఏమాత్రం సింక్ లేదు… అయినా కానీ ఎదో ఉంటుంది ఎదో ఉంటుంది అన్న ఆసక్తి తో సినిమా ను మనం ఎండ్ వరకు చూస్తాం… మొత్తం చూశాక అసలు విషయం లేదని గ్రహిస్తాం…

మొత్తం మీద ఇతర సైకో థ్రిల్లర్స్ తో పోల్చితే చాలా వీక్ స్టొరీ ఉన్న మూవీ ఇది… అయినా కానీ చాలా సేపు సినిమా చూసేలా చేస్తుంది… మొత్తం చూశాక నిరాశ తప్పదు…. టోటల్ గా సినిమా రెగ్యులర్ సైకో థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్లకి కూడా బిలో యావరేజ్ లా అనిపిస్తుంది.. సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here