కెరీర్ ని మొదలు పెట్టడం భారీ సినిమాలతో మొదలు పెట్టి మంచి సినిమాలు పడినా కానీ వాటితో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయిన బెల్లంకొండ శ్రీనివాస్ ఎట్టకేలకు 2019 ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రాక్షసుడు సినిమా తో మంచి హిట్ ని సొంతం చేసుకోగా తర్వాత చేస్తున్న అల్లుడు శీను సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, కాగా ఈ సినిమా తర్వాత….
బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని సినిమాలను కమిట్ అయినా కానీ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా తనకి బాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ రావడం జరిగింది అని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతూ ఉండగా వాటిని బెల్లంకొండ కూడా ఖండించక పోవడం తో ఇది నిజమే అని…
అంతా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ కి అల్టిమేట్ మాస్ క్రేజ్ పెరిగేలా చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ కాగా ఈ సినిమాలో బెల్లంకొండ కి జోడిగా సారా అలీ ఖాన్ మరియు అనన్య పాండేలు జంటగా నటించబోతున్నారు అంటున్నారు. ఇక సినిమాకి డైరెక్టర్ గా…
ఎవరిని తీసుకుంటారు అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా అందరికీ షాక్ ఇస్తూ పాన్ ఇండియా లెవల్ లో 350 కోట్లతో రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో లాంటి బిగ్ యాక్షన్ మూవీ చేసిన సుజీత్ ఈ సినిమా కి డైరెక్షన్ చేయబోతున్నారు అంటూ వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా…
వార్తలు సాలిడ్ గా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నా ఎవ్వరూ నో చెప్పక పోవడంతో… నిజం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే బెల్లంకొండకి బాలీవుడ్ లో అల్టిమేట్ ఎంట్రీగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉంటుంది. మరి ఇది నిజం అవుతుందో కాదో చూడాలి మరి.