టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకప్పుడు వరుస హిట్స్ తో రాజమౌళి తర్వాత ప్లేస్ లో కంటిన్యూ గా ఉండేవారు కానీ అల్లుడు శీను హిట్ మూవీనే అయినా కమర్షియల్ గా ఫ్లాఫ్ అవ్వడం తో అప్పటి నుండి వినాయక్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమంత కలిసి రావడం లేదు. తర్వాత అఖిల్ తో డిసాస్టర్ పడగా మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తో కంబ్యాక్ కొట్టినా…
సినిమా మాత్రం ఒరిజినల్ కి దరిదాపుల్లో కూడా లేదని విమర్శలు వచ్చినా చిరు క్రేజ్ తో లాగేశాడు, తర్వాత చేసిన ఇంటెలిజెంట్ మరో డిసాస్టర్ మూవీ గా నిలవడం తో ఇలాంటి టైం లో రెండేళ్ళుగా కొత్త సినిమా మొదలు పెట్టని వినాయక్ కి…
మరోసారి మెగాస్టార్ నుండి ఫోన్ కాల్ లూసిఫర్ రీమేక్ కోసం వెళ్ళగా ఆ రీమేక్ పనుల్లో కొంత కాలంగా ఉన్న వినాయక్ చేసిన మార్పులు పెద్దగా ఎవ్వరికీ నచ్చకపోవడం తో రీమేక్ నుండి వినాయక్ తప్పుకోగా ఇప్పుడు ఏ సినిమా చేస్తారా అని అందరూ అనుకుంటూ ఉండగా సడెన్ గా అందరికీ షాక్ ఇస్తూ…
తను లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ని ఇప్పుడు హిందీ లో కూడా లాంచ్ చేయబోతున్నాడు వినాయక్, ప్రభాస్ ఛత్రపతి సినిమాను ఇప్పుడు అఫీషియల్ గా హిందీ లో రీమేక్ చేయబోతుండగా ఆ సినిమా కి డైరెక్టర్ గా ఇప్పుడు వివి వినాయక్ ని కన్ఫాం చేశారు. సినిమా ను రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయడం విశేషం అని చెప్పొచ్చు…
లూసిఫర్ రీమేక్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ అవకాశం రావడం, అది కూడా తను లాంచ్ చేసిన హిరోనే అక్కడ లాంచ్ చేయబోతు ఉండటం తో అక్కడ తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు వినాయక్. మరి హిందీ లో ఈ రీమేక్ ఎంతవరకు వర్కౌట్ అయ్యి ఇద్దరికీ కలిసి వస్తుందో చూడాలి మరి.