హాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన టెనెట్ వరల్డ్ వైడ్ గా పాండమిక్ పరిస్థితులలో రిలీజ్ అయిన అతి పెద్ద సినిమాగా నిలవగా ఓవర్సీస్ లో చాలా దేశాల్లో సినిమా రిలీజ్ అవ్వడం పరుగును కూడా పూర్తీ చేయడం జరిగింది, కానీ ఇండియా లో లేట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు 1500 వరకు స్క్రీన్స్ లో ఇండియా లో రిలీజ్ ను సొంతం చేసుకుంది.
సినిమా కథ ఏంటి అనేది అర్ధం అయినా స్క్రీన్ ప్లే ఊహకందని రేంజ్ లో ఉండటం తో ఆడియన్స్ సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. సినిమా కి మొదటి అంచనాలను తగ్గట్లు కలెక్షన్స్ రాలేదు… 4 కోట్లు మినిమం అనుకుంటే 1.25 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మొత్తం మీద సొంతం చేసుకున్న సినిమా…
వీకెండ్ మొత్తం మీద ఇప్పుడు 4.7 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని ఇండియా వైడ్ గా సొంతం చేసుకుంది, అందులో తమిళ్ వర్షన్ కి గాను 43 లక్షల గ్రాస్ కలెక్షన్స్ రాగా తెలుగు వర్షన్ కి గాను మొత్తం మీద మూడు రోజుల్లో 25 లక్షల రేంజ్ లో షేర్ ని…
టెనెట్ సినిమా సొంతం చేసుకుందని సమాచారం. సినిమాను ఇండియా లో పెర్సేంటేజ్ బేస్ మీదే రిలీజ్ చేశారు. దాంతో బిజినెస్ లేకున్నా వచ్చిన మొత్తం కలెక్షన్స్ తర్వాత పంచుకుంటారు. మొత్తం మీద మొదటి రోజు సాధిస్తుంది అనుకున్న కలెక్షన్స్ లెక్కను సినిమా ఇప్పుడు వీకెండ్ కి సాధించడం ఒకింత షాకింగ్ లెక్కలు అనే చెప్పాలి…
ఇదే సినిమా నార్మల్ డేస్ లో రిలీజ్ అయ్యి ఉంటె అవలీలగా వీకెండ్ లోనే 40 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది అని చెప్పాలి, ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితులు ఎంతలా దెబ్బ తిన్నాయో తిరిగి సద్దుకోవాల్సిన అవసరం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి మరి.