Home న్యూస్ IIT కృష్ణమూర్తి రివ్యూ….థ్రిల్లర్ అన్నారు…ఏంటి సామి ఇది!!

IIT కృష్ణమూర్తి రివ్యూ….థ్రిల్లర్ అన్నారు…ఏంటి సామి ఇది!!

0

OTTలో వారానికి ఒకటి రెండు సినిమాలు కచ్చితంగా రిలీజ్ అవుతూ వస్తుండగా అమెజాన్ ప్రైమ్ నుండి కూడా సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఎప్పటి నుండో సినిమాలు రిలీజ్ అవుతున్నా రీసెంట్ గా కొన్ని సినిమాలతో మంచి ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటున్న అమెజాన్ ప్రైమ్ లో లేటెస్ట్ గా చిన్న సినిమా IIT కృష్ణమూర్తి డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ట్రైలర్ తో మెప్పించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే కనిపించకుండా పోయిన తన అంకుల్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన హీరో అంకుల్ సడెన్ గా చనిపోయాడని, అంతే కాకుండా తన దహన సంస్కారాలు కూడా అయిపోయాయని చెబుతారు, అలా కనిపించకుండా పోవడం చనిపోవడం వెనుక….

కానీ తన అంకుల్ చనిపోలేదని, ఎవరో చంపారని తెలుసుకున్న హీరో ఎలా కనిపెట్టాడు అన్నది అసలు కథ. కథ పాయింట్ కొంచం ఆసక్తిని రేపుతూ థ్రిల్లర్ లానే అనిపించినా కానీ తెరకెక్కించిన విధానం మాత్రం తీవ్రంగా నిరాశ పరిచేలా చేస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా హీరో సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయ్యాడు…

ఎక్స్ ప్రెషన్స్ పలకడం కష్టం అవ్వడం సీన్ కి తన నటనకి సింక్ లేకుండా ఉండటం మరింత ఇబ్బంది పెట్టడం జరిగింది, హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా వినయ్ వర్మ నటన మెప్పించాగా కమెడియన్ సత్య కూడా కొంచం మెప్పించాడు. మిగిలిన పాత్రలు ఉన్నంతలో పర్వాలేదు అనిపించాయి కానీ ఆకట్టుకోలేక పోయాయి.

సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు… ఎడిటింగ్ స్క్రీన్ ప్లే నాసిరకంగా ఉన్నాయి. డైలాగ్స్ పర్వాలేదు, సినిమాటోగ్రఫీ కూడా ఓకే అనిపించే విధంగా ఉండగా డైరెక్షన్ పరంగా శ్రీవర్ధన్ అనుకున్న పాయింట్ బాగానే అనుకున్నా కథ అల్లుకోవడం మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా తయారు చేసుకోలేక పోయాడు.

మొత్తం మీద కథ పాయింట్, సస్పెన్స్ రివీల్ చేసే సీన్, క్లైమాక్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండగా మిగిలినవన్నీ కూడా సినిమాలో మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి, లవ్ స్టొరీ, స్లో నరేషన్, ఇరిటేషన్ తెప్పించే సీన్స్ ఇలా సినిమా లెంత్ 1 గంటా 50 నిమిషాలే ఉన్నా కానీ…

పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ముందు చెప్పినట్లు మంచి కథ పాయింట్ ని కొన్ని సీన్స్ మినహా మెప్పించే విధంగా అయితే తెరకెక్కించలేక పోయారు. థ్రిల్లర్ సినిమా అని చెప్పి లవ్ స్టొరీ ని ఇరికించడం, భారీగా డ్రాగ్ చేయడం లాంటివి ఇబ్బంది పెట్టి మొత్తం మీద సినిమా మీద…

ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు…మొత్తం మీద ముందు చెప్పినట్లు ఒకటి రెండు సీన్స్ కోసం కష్టపడి సినిమా చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఈ సినిమా కన్నా బెటర్ మూవీస్ చాలానే ఉన్నాయి వాటిని అయినా ట్రై చేయవచ్చు. ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 1.5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here