Home న్యూస్ ఇదేమి రీమేక్ రా బాబు….భాగమతి రీమేక్ దుర్గామతి రివ్యూ!!

ఇదేమి రీమేక్ రా బాబు….భాగమతి రీమేక్ దుర్గామతి రివ్యూ!!

0

బాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా సౌత్ రీమేక్ లనే ఎక్కువగా నమ్ముకున్తున్నారు కానీ చాలా వరకు రీమేక్ లలో కథ మెయిన్ పాయింట్ అలానే ఉంచి కథనం, ఇతర ఎలిమెంట్స్ ని బాలీవుడ్ కి తగ్గట్లు మార్చుకుని హిట్లు కొట్టే వాళ్లు కానీ ఎందుకనో రీసెంట్ రీమేక్లు మాత్రం మక్కి మక్కి కాపీ పేస్ట్ చేస్తూ పోతున్నారు. రీసెంట్ గా అక్షయ్ కుమార్ లక్ష్మీ ఇలానే తెరకెక్కగా ఇప్పుడు లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ నిర్మాణంలో….

భూమి పడ్నేకర్ ముఖ్య భూమిక పోషిస్తూ తెలుగు లో లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన సూపర్ హిట్ మూవీ భాగమతి ని హిందీ లో దుర్గామతిగా రీమేక్ చేసి రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉందో ఎంతవరకు ఆకట్టుకుందో విశేషాలను తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ ఏంటి అనేది అందరికీ ముందే తెలిసిందే, భాగమతి సినిమాలో కథ మొత్తాన్ని అలానే సీన్ బై సీన్ కాపీ పేస్ట్ చేశారు ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అశోక్. కానీ ఒరిజినల్ లో ఉన్న పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కానీ తమన్ అందించిన అల్టిమేట్ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ…

ఇక్కడ ఫుల్లుగా మిస్ అయ్యాయి. పెర్ఫార్మెన్స్ పరంగా లీడ్ రోల్ చేసిన భూమి పడ్నేకర్ తన వరకు బాగానే చేసినా అనుష్క రోల్ కి మినిమం న్యాయం చేయలేక పోయింది. భాగమతి సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తె కచ్చితంగా భూమి పెర్ఫార్మెన్స్ కి మైనస్ మార్కులు వేయడం ఖాయమని చెప్పాలి. ఇక హిందీ ఆడియన్స్ కూడా చాలా వరకు…

భాగమతి సినిమాను చూసి ఉండటం తో అనుష్క పులిలా చేస్తే భూమి పిల్లిలా చేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు, జయరాం రోల్ చేసిన అర్షద్ వార్సీ ఉన్నంతలో మెప్పించాడు. మిగిలిన వాళ్ళు బిలో యావరేజ్ అనే చెప్పాలి. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ రెండూ కూడా..

జస్ట్ యావరేజ్ అనిపించే విధంగా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఒరిజినల్ లో ఉన్న సీన్స్ నే మళ్ళీ దింపారు తప్పితే కొత్త క్రియేటివిటీ ఏమి లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉండగా డైరెక్షన్ పరంగా అశోక్ ఒరిజినల్ ని మెప్పించిన విధానంలో సగం కూడా మెప్పించలేకపోయాడు,

బహుశా బాలీవుడ్ లో నిర్మాతల ప్రెజర్ వలన తను అనుకున్న ఔట్ పుట్ రాలేదేమో అనిపించింది. కొన్ని సీన్స్ వరకు ఒరిజినల్ అంత కాకున్నా పర్వాలేదు అనిపించినా కానీ చాలా వరకు సీన్స్ ఒరిజినల్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళని కూడా మెప్పించలేక పోయాయి అని చెప్పాలి. నిజం చెప్పాలి అంటే….

ఒరిజినల్ వర్షన్ కి కూడా మరీ అద్బుతమైన టాక్ ఏమి రాలేదు కానీ అక్కడ అనుష్క ఉండటం, తన పెర్ఫార్మెన్స్ అండ్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అవ్వడం తో సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది, కానీ ఇక్కడ ఎవ్వరూ కూడా పూర్తి న్యాయం చేయలేక పోయారు సినిమాకి.

మొత్తం మీద ఒరిజినల్ చూసిన వాళ్ళు ఇదేమి రీమేక్ రా బాబు అనుకోవడం ఖాయం, ఇక చూడని వాళ్ళు జస్ట్ యావరేజ్ మూవీ అనుకుంటారు. ఓవరాల్ గా ఒరిజినల్ తో పోల్చితే పూర్ రీమేక్ అని చెప్పాలి. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here