అన్ని అనుకున్నట్లు జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసు లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపాల్సిన ఇలయ దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు సంక్రాంతి రేసులో ఎంటర్ అయిన విషయం తెలిసిందే, కాగా సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు ఆగిపోయి కూడా 8 నెలలు అవుతుంది, సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతాయో లేదో అన్న డౌట్ వలన…
చాలా థియేటర్స్ తెరచుకోక పోవడం వలన ఏరియాల వారి బిజినెస్ లు ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు సౌత్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న పెద్ద సినిమా విజయ్ ది అవ్వడంతో సినిమా బిజినెస్ మెల్లి మెల్లిగా జోరు అందుకోవడం మొదలు అయ్యింది అని చెప్పాలి. సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వడంతో….
పక్క రాష్ట్రం కేరళలో సినిమాను భారీగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన సౌత్ స్టేట్స్ లో థియేటర్స్ ఓపెన్ అయినా కానీ కేరళలో ఇంకా థియేటర్స్ ఓపెన్ అవ్వాలేదు. కానీ మాస్టర్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ ని రీ ఓపెన్ చేసి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని డిసైడ్ అయిన కేరళ థియేటర్స్ ఓనర్స్….
జోష్ తో ఇప్పుడు సినిమా కేరళ బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కి వచ్చింది అంటున్నారు. సమ్మర్ రిలీజ్ టైం లో సినిమా కి బిజినెస్ ఆఫర్స్ కింద 5 కోట్లకు తగ్గని ఆఫర్లు రాగా ఇప్పుడు పరిస్థితులు 50% ఆక్యుపెన్సీ కండీషన్లు ఉండటం తో అక్కడ బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు మాస్టర్ సినిమా కొనడానికి ఆల్ మోస్ట్ 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో…
ఆఫర్లను ఇస్తున్నారని సమాచారం. ముందు ఆఫర్ రేటుతో పోల్చితే ఇది సగం రేటు అయినా కానీ ప్రస్తుత పరిస్థితులను గమనించి నిర్మాతలు ఇప్పుడు ముందు ఒక రేటుకి ఫిక్స్ అయ్యి తర్వాత లాభాలను పంచుకోవాలని డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే రేటు కన్ఫాం అవుతుంది అంటున్నారు. ఇక సంక్రాంతి రేసులో మాస్టర్ హవా సౌత్ మొత్తం దంచికొట్టడం ఖాయం అని చెప్పొచ్చు.