Home న్యూస్ RGV కరోనా వైరస్ ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్ చిల్లర!

RGV కరోనా వైరస్ ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్ చిల్లర!

0

8 నెలల తర్వాత థియేటర్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెన్ అయినా చాలా లిమిటెడ్ గా ఓపెన్ అవుతూ వస్తున్నాయి. టెనెట్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 50 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో సొంతం చేసుకుంటూ ఉండగా కరోనా తర్వాత తెలుగు లో థియేటర్స్ లో రిలీజ్ అయిన మొట్ట మొదటి సినిమాగా మారిన రామ్ గోపాల్ వర్మ..

నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కరోనా వైరస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదు అనిపించే రిలీజ్ ని సొంతం చేసుకుంది, ఆల్ మోస్ట్ 100 నుండి 120 వరకు స్క్రీన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం…

పెద్దగా ఇంపాక్ట్ ని అయితే క్రియేట్ చేయలేదు సరికదా చిల్లర కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది, రామ్ గోపాల వర్మ సినిమాలను జనాలు చూడటమే మానేశారు, అలాంటి పరిస్థితిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సాధించిన షేర్ ఎంతో తెలుసా…

1.25 లక్షల నుండి 1.5 లక్షల దాకా షేర్ ని సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి సాధించింది… ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందొ జనాలు సినిమాల మీద మినిమం ఇంట్రెస్ట్ చూపడం లేదు అందునా రామ్ గోపాల్ వర్మ సినిమా పై అస్సలు చూపడం లేదు అని మరోసారి క్లియర్ అయ్యింది అని చెప్పొచ్చు. సినిమా కొంచం పర్వాలేదు అనిపించే విధంగా ఉన్న కానీ…

జనాలు మాత్రం మొదటి రోజు ఎలాంటి రిస్క్ తీసుకోలేదు, ఇక రెండో రోజు కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసిందని అంటున్నారు. ఇక సినిమా బడ్జెట్ వివరాలు వీకెండ్ కలెక్షన్స్ తో అప్ డేట్ అవుతాయి. మరి సినిమా మూడు రోజుల వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని సాధించి స్టడీగా ఉంటుందో లేదో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here