బాలీవుడ్ లో ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలలో వరుణ్ ధవన్ మరియు సారా అలీ ఖాన్ ల కాంబినేషన్ లో రూపొందిన కూలీ నంబర్ 1 సినిమా కూడా ఒకటి… కరోనా వలన సినిమాను డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు… కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసింది అమెజాన్ ప్రైమ్. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే… ఒక పెళ్ళిళ్ళు కుదిర్చే పంతులు ఒక పెద్దింటి అమ్మాయికి ఒక సంబంధం తీసుకొస్తాడు… ఆ పెళ్లి కొడుకు స్టేటస్ ను ఆ పెళ్ళిళ్ళు కుదిర్చే పంతులుని చాలా తక్కువ చేసి మాట్లాడుతాడు హీరోయిన్ ఫాదర్…. అప్పుడు…
హీరోయిన్ ఫాదర్ తో ఒక ఛాలెంజ్ చేసిన పంతులు హీరోయిన్ ఫాదర్ పొగరు ని ఒక రైల్వే కూలీ ని హీరోయిన్ కి ఎలా సెట్ చేసి పొగరు అనిచాడు అన్నది మొత్తం మీద సినిమా కథ… ఈ కథ ఆల్ రెడీ మనం చూసి చూసి ఉన్న కథ… ఓల్డ్ కూలీ నంబర్ 1 కథని….
ఏమాత్రం మార్చకుండా సీన్ బై సీన్ రీమేక్ చేయగా ఇలాంటి కథతోనే తెలుగు లో హంగామా సినిమా కూడా రూపొందింది… పెర్ఫార్మెన్స్ పరంగా ప్రతీ ఒక్కరు అవసారానికి మించి ఓవర్ యాక్టింగ్ తో చిరాకు పుట్టిస్తారు.. నటించాల్సిన దానికన్నా కూడా డబుల్ ట్రిబుల్ డోస్ తో నటించి చాలా సీన్స్ లో సహనానికి పరీక్ష పెట్టారు అని చెప్పొచ్చు…
వరుణ్ ధవన్ కానీ సారా అలీ ఖాన్ లు కానీ పరేష్ రావెల్ లు కానీ ఓవర్ యాక్షన్ తో సినిమా మొత్తం చిరాకు తెప్పించారు. రీమేక్ సినిమానే అయినా మినిమమ్ క్రియేటివిటీ లేకుండా సీన్ టు సీన్ పాత సినిమానే దింపడం బాలీవుడ్ లో ఇది వరకు జరగలేదు కానీ ఈ మధ్య జరుగుతుంది, అది ఏమాత్రం బాలేదనే చెప్పాలి.
ఇక సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ అనే చెప్పాలి, పాటలు రీమిక్స్ అయినా కానీ సినిమా చూసే టైం లో కొంచం రిలాక్స్ అయ్యేలా చేసినవి పాటలు అనే చెప్పాలి, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా ఉంటుంది. ఎడిటింగ్ పరమ బోర్, స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా ఉంటుంది…
సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, డైరెక్షన్ పరంగా డేవిడ్ ధవన్ ఏమాత్రం కొత్తగా ట్రై చేయలేదు… పరమ రొటీన్ కమర్షియల్ కామెడీ మూవీ తీశాడు డేవిడ్ ధవన్… ఇలాంటి కన్ఫ్యూజన్ కామెడీలు చూసి చూసి మన తలలు ఎప్పుడో పండిపోయాయి…
వాటిని మనం పక్కకు పెట్టి కూడా చాలా టైం అవుతుంది కానీ బాలీవుడ్ వాళ్ళు కొత్త కథలు దొరకక ఇలాంటివే చేస్తూ వస్తున్నారు. ఓవరాల్ గా అక్కడక్కడా కొన్ని సీన్స్ అతి కష్టం మీద కామెడీ జనరేట్ చేసినా కానీ పరమ రొటీన్ బోరింగ్ మూవీ కూలీ నంబర్ 1 అని చెప్పొచ్చు. ఇక సినిమాలో… ఒక సీన్ గురించి చెప్పుకోవాలి…
బాలయ్య సినిమాల్లో ట్రైన్ ని వెనక్కి పంపడం లాంటివి వినయ విదేయ రామ లో ట్రైన్ ఎక్కి రాష్ట్రాలు రావడం లాంటివి ఎలా ట్రోల్ అయ్యయో తెలిసిందే. బాలీవుడ్ వాళ్ళు కూడా ట్రోల్ చేశారు. అలాంటిది ఈ సినిమాలో ట్రైన్ ట్రాక్ లో ఒక బాబుని కాపాడటానికి హీరో వేగంగా వెళుతున్న ట్రైన్ పై దూకి…
ట్రైన్ కన్నా వేగంగా పరిగెత్తి, ట్రైన్ నే బీట్ చేసి బాబుని కాపాడతాడు… అది చూసి రైల్వే స్టేషన్ లో చప్పట్ల వర్షం కురుస్తుంది… ఈ సీన్ ని ఇప్పటికే సోషల్ మీడియా లో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి నాన్ సెన్స్ సీన్స్ తో నిండిన కూలీ నంబర్ 1 కొన్ని సీన్స్ మినహా ఒరిజినల్ ఒరిజినల్ గోవిందా వర్షన్ లో 10% కూడా మెప్పించ లేక పోయింది… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 1.5 స్టార్స్…