Home TRP రేటింగ్ 1.8 కోట్లకు అమ్మితే…ఒరేయ్ బుజ్జిగా కి సాలిడ్ TRP రేటింగ్!

1.8 కోట్లకు అమ్మితే…ఒరేయ్ బుజ్జిగా కి సాలిడ్ TRP రేటింగ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా అయినా కానీ కరోనా వలన అది కుదరలేదు… దాంతో ఎదురు చూసి చూసి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టాక్ రివ్యూలు యావరేజ్ గా వచ్చినా కానీ సాలిడ్ వ్యూస్ తో దుమ్ము లేపింది.

తర్వాత సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు సొంతం చేసుకున్నారు… సినిమా డిజిటల్ రైట్స్ 4 కోట్ల దాకా రేటు సొంతం చేసుకుంటే శాటిలైట్ రైట్స్ మొత్తం మీద 1.8 కోట్ల రేటు కి దక్కించుకుంది. ఇక సినిమా ను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు.

కాగా మొదటి సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా ఇతర సినిమాలతో పోల్చితే మరీ అద్బుతం కాదు కానీ పెట్టిన రేటు ప్రకారం చూసుకుంటే మాత్రం మంచి రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. మొత్తం మీద సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 5.3 TRP రేటింగ్ ని….

సొంతం చేసుకుని సత్తా చాటుకుంది…. కొన్ని పెద్ద సినిమాలు కూడా ఇలాంటి రేటింగ్ ని ఈ మధ్య సొంతం చేసుకోలేదు. అలాంటిది రేటు తక్కువే అయినా కానీ సాలిడ్ గా హోల్డ్ చేసిన ఒరేయ్ బుజ్జిగా సినిమా మొదటి సారే మంచి రేటింగ్ ను సాధించింది, జీ తెలుగు వాళ్ళు సినిమా కి పర్వాలేదు అనిపించేలా ప్రమోషన్ చేశారు. మరింత గట్టిగా ప్రమోషన్ చేసి ఉంటే సినిమా…

కచ్చితంగా మరింత బెటర్ రేటింగ్ ని సొంతం చేసుకుని ఉండేది అని చెప్పాలి. ఆల్ రెడీ డిజిటల్ రిలీజ్ లో దుమ్ము లేపిన సినిమా TRP రేటింగ్ ల పరంగా కూడా సత్తా చాటుకోగా… ఇక జనవరి 1 న సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా ఎంతో కొంత కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here