Home న్యూస్ సినిమా బాయ్ కాట్ చేస్తాం అన్నారు…రికార్డ్ వ్యూస్ కట్టబెట్టారు!

సినిమా బాయ్ కాట్ చేస్తాం అన్నారు…రికార్డ్ వ్యూస్ కట్టబెట్టారు!

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం విషయం లో ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా ఏది నిజమో తెలియక ఆల్ మోస్ట్ రెండు మూడు రోజుల కి ఒకసారి సోషల్ మీడియా లో ట్రెండ్ జరుగుతూనే ఉంది కానీ ఇప్పటి వరకు నిజా నిజాలు అసలు బయటికి అయితే రాలేదు. ఇక ఈ ఎఫెక్ట్ మాత్రం ఫ్యాన్స్ సినిమాల పై ముఖ్యంగా స్టార్ కిడ్స్ సినిమా ల పై చాలా గట్టిగా చూపుతున్నారనే చెప్పాలి…

ఆలియా భట్ సడక్ 2 సినిమా విషయం లో అలాగే అనన్య పాండే నటించిన ఖాళీ పీలి విషయం లో స్ట్రిక్ట్ గా ఉన్న ఫ్యాన్స్ రెండు సినిమాలను అసలు ఏమాత్రం దేకలేదు. కానీ అక్షయ్ కుమార్ లక్ష్మీ సినిమా విషయం లో కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి అనుకున్నా సినిమా కి…

వ్యూస్ సాలిడ్ గానే దక్కాయి… ఇక స్టార్ కిడ్స్ వరుణ్ ధవన్ మరియు సారా అలీ ఖాన్ ల కాంబినేషన్ లో వస్తున్న కూలీ నంబర్ 1 ని కచ్చితంగా బాయికాట్ చేసి తీరుతామని సినిమా ట్రైలర్ టైం లో భారీ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్ అందరూ….

కానీ ట్రైలర్ కి సాలిడ్ గా వ్యూస్ దక్కాయి. ఇక తర్వాత సాంగ్స్ ని ఒక్కొటిగా రిలీజ్ చేయడం మొదలు పెట్టగా ఫ్యాన్స్ కి భయపడి లైక్స్ అండ్ డిస్ లైక్స్ కనిపించకుండా జాగ్రత్త పడినా కానీ సాంగ్స్ కి వ్యూస్ మాత్రం రికార్డ్ స్థాయిలో వచ్చాయి. ఇప్పటి వరకు సినిమాలో 4 సాంగ్స్ రిలీజ్ అవ్వగా అన్నింటికీ కలిపి ఆల్ మోస్ట్…

180 మిలియన్స్ కి పైగా వ్యూస్ ఇప్పటికే సొంతం అయినట్లు సమాచారం. ఇది నిజంగానే షాకింగ్ అని చెప్పొచ్చు. లైక్స్ డిస్ లైక్స్ కనిపించకుండా చేసినా కానీ వ్యూస్ మాత్రం ఆగట్లేదు… ఫ్యాన్స్ బాయికాట్ చేస్తాం అంటున్నా కానీ వ్యూస్ రాకపోవడం తో ఇక ఈ ప్రభావం తగ్గింది అని అంతా భావిస్తున్నారు… మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here