Home న్యూస్ నితిన్ చెక్ మూవీ టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలి?

నితిన్ చెక్ మూవీ టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలి?

0

యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు, లాస్ట్ ఇయర్ భీష్మతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత నితిన్ చేసిన రంగ్ దే సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుండగా ఆ సినిమా కన్నా ముందే తర్వాత షూటింగ్ చేసిన లేటెస్ట్ మూవీ చెక్ సినిమాను ఆడియన్స్ ముందుకు 26 న తీసుకు రానున్న నితిన్ ఈ సారి పూర్తీ ఎక్స్ పెరిమెంటల్ మూవీతో రాబోతున్నాడు.

అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుని సత్తా చాటుకుంది… ఒకసారి సినిమా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను గమనిస్తే… ముందుగా సినిమా నైజాం ఏరియాలో మొత్తం మీద 5.4 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది.

ఇక సీడెడ్ ఏరియాలో సినిమా 2.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. టోటల్ ఆంధ్రా రీజన్ లో 6.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. కాగా ఇక్కడ కొన్ని సెంటర్స్ లో ఓన్ రిలీజ్ జరగబోతుంది అని సమాచారం. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో..

సినిమా టోటల్ గా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి మరో 1.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ ఇప్పుడు 16.1 కోట్ల మార్క్ ని అందుకుందని చెప్పొచ్చు. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే..

మినిమమ్ 16.5 కోట్ల మార్క్ ని అధిగమించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సినిమా ఎక్స్ పెరిమెంటల్ మూవీ అవ్వడంతో మరీ నార్మల్ కమర్షియల్ మూవీలా కాకున్నా టాక్ బాగుంటే కచ్చితంగా ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here