బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడెప్పుడో లవ్ లీ సినిమా తో చివరి సారి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ తర్వత నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ క్లీన్ హిట్ ని సొంతం చేసుకోలేక పోయాడు, కానీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ శశి మాత్రం ఎందుకో తిరిగి ఆది ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో అని అనిపించింది…
దానికి కారణం సినిమా పాటలు మంచి హిట్స్ గా నిలవడం, ఆ కారణం వలెనే సినిమా కి అడ్వాంటేజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ బాగా వస్తాయి అని అంతా అనుకున్నారు కానీ శశి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపలేక పోయింది.
సినిమా రిలీజ్ అవ్వడమే మిక్సుడ్ టాక్ తో రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఏ దశలో కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయింది. సినిమా మొత్తం మీద వీకెండ్ లో చిల్లర కలెక్షన్స్ తో ముగించింది.
ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 9L
👉Ceeded: 4L
👉UA: 5L
👉East: 4L
👉West: 2L
👉Guntur: 3L
👉Krishna: 3L
👉Nellore: 2L
AP-TG Total:- 0.32CR (0.60Cr Gross~)
KA+ROI: 1L
OS: 3L
Total WW: 0.36CR(0.70Cr Gross~)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క.
సినిమాను టోటల్ గా 3.25 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద మూడు రోజులు ముగిసిన తర్వాత సినిమా మరో 3.14 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుంది, అది అసాధ్యం కాబట్టి 9 ఏళ్ళుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది ఇంకా ఎదురు చూడక తప్పని పరిస్థితి.