Home న్యూస్ లాస్ట్ ఇయర్ తెలుగులో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరో ఇతనే…కానీ ఒక్క హిట్ లేదు!!

లాస్ట్ ఇయర్ తెలుగులో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరో ఇతనే…కానీ ఒక్క హిట్ లేదు!!

0

కొందరు హీరోలకి హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, కానీ అందులో బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం హిట్స్ పడితే నిర్మాతలకు అలాగే హీరోకి మేలు కానీ వరుస ఫ్లాఫ్స్ వస్తూనే ఉన్నా కానీ ఛాన్స్ లు వస్తూనే ఉండటం మాత్రం కొందరికి మాత్రమే సొంతం అవుతాయి…. అలాంటి హీరోలలో సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి…

కెరీర్ లో మొదటి 2 సినిమాలు ప్రేమ కావాలి మరియు లవ్ లీ సినిమాలు మంచి విజయాలుగా నిలవగా తర్వాత వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుంటూనే ఉన్నా కానీ వరుస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఆది సాయి కుమార్ 2022 ఇయర్ లో…

వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వలేదు, లాస్ట్ ఇయర్ టాలీవుడ్ హీరోలలో అందరి కన్నా ఎక్కువ సినిమాలు ఆది సాయి కుమార్ మాత్రమే చేయడం మరో విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

బ్లాక్, తీస్ మార్ ఖాన్, టాప్ గేర్, క్రేజీ ఫెల్లో, అతిధి దేవోభవ ఇలా ఆది సాయి కుమార్ నటించిన సినిమాలు 5 రిలీజ్ అవ్వగా మరి 2 సినిమాల రిలీజ్ లు పోస్ట్ పోన్ అయ్యాయి. ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటి కూడా హిట్ గా నిలవలేదు. ఇక ఈ ఏడాది కూడా వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో ఏ సినిమాతో నైనా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here