Home న్యూస్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వని మూవీ కి నేషనల్ అవార్డ్..ఎలా ఇచ్చారంటే?

థియేటర్స్ లో రిలీజ్ అవ్వని మూవీ కి నేషనల్ అవార్డ్..ఎలా ఇచ్చారంటే?

0

రీసెంట్ గా నేషనల్ అవార్డులను 2019 నుండి 2020 మార్చ్ వరకు రిలీజ్ అయిన మూవీస్ కి గాను అనౌన్స్ చేశారు. కాగ టాలీవుడ్ లో మహేష్ బాబు మహర్షి కి 2 అవార్డులు, నాని జెర్సీ సినిమాకి 2 నేషనల్ అవార్డులు దక్కాయి. ఇక కోలివుడ్ స్టార్ ధనుష్ కి అసురన్ మూవీ కి గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది. బాలీవుడ్ హీరో లేట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోరే సినిమా కి…

బాలీవుడ్ తరుపున బెస్ట్ మూవీగా ఎంచుకున్నారు. అవార్డులు పక్కా కొడతాయి అనుకున్న మూవీస్ కి ఎదురుదెబ్బ తగిలినా ఇప్పుడు మరొక సర్ప్రైజ్ కూడా జరిగింది, చాలా వరకు అవార్డులు థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ కి ఇస్తారు… కానీ మలయాళ సూపర్ స్టార్…

మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ మరక్కర్ లయన్ ఆఫ్ ది అరేబియన్ సి మూవీ కి 3 అవార్డులు ఇచ్చారు, కానీ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాలేదు, లాస్ట్ ఇయర్ మార్చ్ ఎండ్ టైం లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా వలన సినిమా పోస్ట్ పోన్ అయ్యి త్వరలో రిలీజ్ కానుంది.

కానీ ఈ సినిమా ఏకంగా 3 కేటగిరీలలో అవార్డులు ఇచ్చారు, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు బెస్ట్ కాస్ట్యూమ్స్ ఇలా 3 నేషనల్ అవార్డులను ఈ సినిమా రిలీజ్ కాక ముందే సొంతం చేసుకుని ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఇలా మూవీ రిలీజ్ కాకున్నా కానీ అవార్డ్ ఎలా దక్కింది అని కొందరికీ డౌట్ ఉన్నప్పటికీ కూడా… అవార్డ్ కమిటీ అన్ని సినిమాలను కూడా..

తిరిగి స్పెషల్ స్క్రీనింగ్ లోనే చూస్తారు… అందులో చాలా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వనివే ఉంటాయి. అలానే ఈ సినిమాను కూడా స్పెషల్ స్క్రీనింగ్ లో కమిటీకి చూపెట్టారు, దాంతో ఆ ఇయర్ కి గానే సినిమాను కన్సిడర్ చేసి మూడు అవార్డులను ఇచ్చారు… సినిమా సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది, అవార్డులు దక్కాయి కాబట్టి సినిమాకి మరింత అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here