కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో హిట్ కొట్టి ఏళ్ళు అవుతుంది, ఆల్ మోస్ట్ 5 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ సూపర్ హిట్స్ ని అందుకున్న నాగార్జున రీసెంట్ టైం లో ఫాం కంప్లీట్ గా కోల్పోయి చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలుస్తూ తీవ్ర నిరాశ పడేలా చేస్తున్నాయి. లాస్ట్ 2 సినిమాలు ఆఫీసర్ మరియు మన్మథుడు 2…
సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ మూవీస్ గా నిలవగా ఆ సినిమాల తర్వాత కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్న వైల్డ్ డాగ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కానీ ఆడియన్స్ ను తిరిగి థియేటర్స్ కి రప్పించలేక… బాక్స్ ఆఫీస్ దగ్గర…
డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం ఏకంగా 28 కోట్ల భారీ రేటు ఆఫర్ వచ్చినా నో చెప్పిన నాగార్జున ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత రిలీజ్ అయిన 19 వ రోజున సినిమాను ఇప్పుడు…
డిజిటల్ లో రిలీజ్ చేస్తున్నాడు….బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయినా కానీ డిజిటల్ రిలీజ్ లో సౌత్ భాషలు అన్నింటి లో డబ్ అయ్యి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓవరాల్ గా మంచి రేటు నే సొంతం చేసుకుంది అని తెలుస్తుంది. టోటల్ గా తక్కువ టైం లోనే టెలికాస్ట్ అవుతూ ఉండటం… సౌత్ భాషలు అన్నీ కవర్ చేయడం తో…
మొత్తం మీద సినిమాకి ఇప్పుడు 12 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ రేటు నెట్ ఫ్లిక్స్ నుండి సొంతం అయినట్లు తెలుస్తుంది. రిలీజ్ కి ముందే ఆలోచించి 28 కోట్ల ఆఫర్ కి ఓకే చెప్పి ఉంటే ఇప్పుడు అన్ని భాషల డబ్బింగ్ కలిపి శాటిలైట్ రైట్స్ తో అల్టిమేట్ ప్రాఫిట్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుని ఉండేది.. కానీ ఇప్పుడు ఈ రేటు తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.