Home న్యూస్ బాలయ్య మాస్ పవర్…టాప్ 2 తో భీభత్సం…టాప్ లేపే ఛాన్స్ ఉంది!

బాలయ్య మాస్ పవర్…టాప్ 2 తో భీభత్సం…టాప్ లేపే ఛాన్స్ ఉంది!

1

సడెన్ రిలీజే అయినప్పటికీ కూడా నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందిన హాట్రిక్ మూవీ అఖండ రీసెంట్ ఇంట్రో టీసర్ కి యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ లభిస్తుంది. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ ల జాబితా లో కూడా ఈ టీసర్ ఒకటిగా చేరడానికి సిద్ధం అవుతూ ఉండగా మరో పక్క టాలీవుడ్ లో…

సీనియర్ హీరోల పరంగా ఆల్ రెడీ హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసిన ఈ టీసర్ సౌత్ లో కూడా హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ టీసర్ లలో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి టాప్ ….

ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది….. రెండో ప్లేసులో ఉన్న సూపర్ స్టార్ రజినీ కాలా టీసర్ వ్యూస్ 32.2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి దూసుకు పోతున్న అఖండ టీసర్ ప్రజెంట్ టాప్ 2 తో సౌత్ లో దుమ్ము లేపింది. ఇక ఇప్పుడు ఈ టీసర్ టాప్ ప్లేస్ ను…

సొంతం చేసుకోవడానికి కూడా సూపర్ ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. టాప్ ప్లేస్ లో రజినీకాంత్ నటించిన కబాలి టీసర్ 37 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని ఇంత కాలం టాప్ లో అలానే సీనియర్ హీరోల క్యాటగిరీ లో దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను అఖండ టీసర్ కొన్ని రోజుల్లో బ్రేక్ చేసి…

సౌత్ లోనే హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సడెన్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ను అయితే ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇదంతా కేవలం ఇంట్రో టీసర్ కే జరిగిన రచ్చ కాగా మెయిన్ టీసర్ అండ్ ట్రైలర్ లు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండటం విశేషం…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here