ఇండియా లో సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో ఉన్న టైం లో మళ్ళీ సినిమాలు అన్నీ కూడా వరుస పెట్టి రిలీజ్ లను పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండగా కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ లను ఎంచుకోగా, కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ లో పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ అవ్వాలని డిసైడ్ అయ్యయి, వాటిలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే మూవీ…
ఆడియన్స్ ముందుకు రంజాన్ కానుకగా రీసెంట్ గా పే పెర్ వ్యూ పద్దతిలో ఒక టికెట్ 249 రేటు తో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమాను భారీ రేటు కి కొన్న జీ నెట్ వర్క్ వాళ్ళు జీ ప్లెక్స్ యాప్ లో సినిమాను డబ్బులు పే చేసిన వాళ్లకి…
స్ట్రీం చేయడం మొదలు పెట్టగా ఎక్కువ మంది ఒకే సారి చూడటం తో ఫస్ట్ టైం క్రాష్ అయిన సర్వర్ తర్వాత కూడా ఇబ్బంది పెట్టిందని తెలుస్తుంది. సాయంత్రం టైం కి మొత్తం మీద 4 సార్లు సర్వర్లు క్రాష్ అవ్వడం తో ఫ్యాన్స్ కి మండుకొచ్చింది…. ఈ మాత్రం దానికి…
మీకు డిజిటల్ రిలీజ్ లు అవసరమా అంటూ గట్టిగానే ట్రోల్ చేశారు. ఒకసారి అంటే రిలీజ్ అయిన టైం లో ఎక్కువ మంది ఒకేసారి చూస్తారు కాబట్టి ఇబ్బంది కలిగింది అనుకున్నా తర్వాత స్టేబుల్ గా ట్రాఫిక్ ఉన్నప్పటికీ ఇలా క్రాష్ అవ్వడం తో నాసిరకం సర్వర్స్ వాడుతున్నారా అంటూ ట్రోల్ చేశారు ఫ్యాన్స్. మొత్తం మీద మొదటి రోజు సల్మాన్ ఖాన్ రాధే…
సినిమా కి సాలిడ్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు. పే పెర్ వ్యూ పద్దతి లో ఇండియా లో ఇదే హైయెస్ట్ ఫస్ట్ డే వ్యూవర్ షిప్ అని అంటున్నారు. అసలు కౌంట్ లెక్క త్వరలో తెలియనుంది. అది తెలిసిన తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్ కి ఎంత కలెక్షన్స్ వచ్చాయి అన్న వివరాలు క్లియర్ గా అప్ డేట్ చేస్తాం..