బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి రీసెంట్ టైం లో వరుస పెట్టి ఫ్లాఫ్స్ వస్తున్నాయి, కెరీర్ లో 2009 నుండి అల్టిమేట్ విజయాలతో కొనసాగుతున్న కెరీర్ రీసెంట్ టైం లో రేస్ 3, దబంగ్ 3 లాంటి ఫ్లాఫ్స్ తో దెబ్బ పడగా రీసెంట్ గా వచ్చిన రాధే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదేమో కానీ డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవ్వడం… అందునా…
పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ ను సొంతం చేసుకోవడం తో ఉన్నంతలో మంచి వ్యూస్ రావడం తో సేఫ్ గా నిలిచింది, కానీ సినిమా కంటెంట్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన విషయం తెలిసిందే, ఓవర్సీస్ లో సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
ఇండియా లో కూడా రిలీజ్ టైం లో కొన్ని చోట్ల ఒకటి రెండు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని చిల్లర కలెక్షన్స్ ని దక్కించుకుంది, రీసెంట్ గా మహారాష్ట్ర లో పరిస్థితులు నార్మల్ అయిన కొన్ని చోట్ల సినిమాను 50% లిమిటేషన్ పద్దతిలో 5 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ మూవీ అవ్వడం తో…
జనాలు ఆ థియేటర్స్ బాగా వస్తారు అని అనుకున్నారు కానీ మొత్తం మీద సినిమా కి 5 థియేటర్స్ లో కలిపి తెగిన టికెట్లు కేవలం 84 మాత్రమే అంట… ఆ 84 టికెట్ సేల్స్ ద్వారా వచ్చిన మొత్తం 6 వేల దాకా ఉంటుందని అంటున్నారు. అంటే ఏ రేంజ్ లో ఎఫెక్ట్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో…
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమానే అయినా జనాలు థియేటర్స్ కి వచ్చే మూడ్ లో లేరు, సినిమా అద్బుతంగా ఉన్నా ఇంకా కొన్ని టికెట్లు ఎక్కువ తెగేవి ఏమో కానీ ఓవరాల్ గా సల్మాన్ స్టార్ డం ని నమ్ముకుని రిలీజ్ చేస్తే దెబ్బ పడినట్లు అయింది. ఇక ఈ పరిస్థితులు ఎప్పుడు నార్మల్ అవుతాయో చూడాలి ఇక.