Home న్యూస్ 75 కోట్ల సినిమా….50 డేస్ 750 సెంటర్స్…ఎపిక్ మూవీ కి 13 ఏళ్ళు!!

75 కోట్ల సినిమా….50 డేస్ 750 సెంటర్స్…ఎపిక్ మూవీ కి 13 ఏళ్ళు!!

0

రిలీజ్ కి ముందు నుండే విపరీతమైన హైప్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమా ఒకటి, బాక్స్ ఆఫీస్ దగ్గర 2008 టైం లో ఓ రేంజ్ లో హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఫస్ట్ టైం అర్ధం అవ్వలేదు, 3 గంటల లెంత్ ఉన్న ఈ సినిమా లో ఏకంగా 10 రోల్స్ ని పోషించి కమల్ హాసన్…

ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఎవ్వరూ చేయని సాహసం చేసి సఫలం అయ్యాడు, సినిమా ఆ టైం లో చాల మందికి అర్ధం అవ్వక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని నమోదు చేయలేక పోయింది ఈ సినిమా. తెలుగు లో కూడా అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా…

ఆ అంచనాలను అందుకోలేక పోయింది, అయినా కానీ ఈ ప్రయోగాన్ని మెచ్చుకొని వారు లేరనే చెప్పాలి. ఆ టైం లోనే ఏకంగా 75 కోట్ల రేంజ్ బడ్జెట్ లో అత్యంత క్వాలిటీ తో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా లో 1000 ప్రింట్స్ తో అలాగే…

ఓవర్సీస్ లో 1000 ప్రింట్స్ తో రిలీజ్ అయ్యింది, తమిళ్ వర్షన్ టోటల్ గా 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని కలెక్ట్ చేయగా తెలుగు వర్షన్ మొత్తం మీద 13 కోట్ల మేర గ్రాస్ ని కలెక్ట్ చేసింది. టోటల్ రన్ లో 103 కోట్ల గ్రాస్ ని 60 కోట్ల మేర షేర్ ని ఆ టైం లో సొంతం చేసుకుంది ఈ సినిమా. ఓవరాల్ బడ్జెట్ పరంగా చూసుకుంటే…

కలెక్షన్స్ ఆశించిన మేర రాకపోయినా కానీ అన్ని డబ్బింగ్ వర్షన్ ల శాటిలైట్ రైట్స్ తో సినిమా పెట్టుబడి రికవరీ అయింది, ఇక సినిమా 50 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గా 750 సెంటర్స్ లో జరుపుకోవడం మరో విశేషం. ఎపిక్ మూవీ గా ఇప్పుడు భావించే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 13 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here