సమ్మర్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్నీ కూడా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమాల రిలీజ్ లు అన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ రాగా అందులో కొన్ని సినిమాల రిలీజ్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డిజిటల్ లో సొంతం చేసుకుంటూ వస్తున్నాయి, కోలివుడ్ నుండి కొన్ని సినిమాలు టాలీవుడ్ నుండి కొన్ని సినిమాలు ఇప్పటికే రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి.
ఈ టైం లో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ కూడా థియేటర్స్ లో రిలీజ్ కోసం ఎదురు చూసి చూసి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
నయనతార మెయిన్ రోల్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీ గా రూపొందుతున్న నేత్రికన్ సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు, నయనతార అందురాలిగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందో లేదో డైరెక్ట్ రిలీజ్ కి మంచి మంచి ఆఫర్స్ రాగా రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు…
సినిమా డిజిటల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు, ఏకంగా 15.2 కోట్ల రేటు చెల్లించి తమిళ్ తో పాటు తెలుగు డబ్బింగ్ రైట్స్ కూడా కలిపి ఈ రేంజ్ రేటు ని ఇచ్చారని సమాచారం. ఇక సినిమా ను జులై లో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారని అంటున్నారు. సినిమా ఓవరాల్ బడ్జెట్ కూడా నయనతార రెమ్యునరేషన్ తో కలిపి…
6 కోట్ల లోపు బడ్జెట్ లోనే తెరకెక్కిందని సమాచారం… అంటే 6 కోట్ల బడ్జెట్ కి డిజిటల్ రిలీజ్ ద్వారానే 15.2 కోట్లు సొంతం చేసుకుని అందులో ఆల్ మోస్ట్ 8.8 కోట్ల మేర ప్రాఫిట్ ను దక్కించుకుంది ఈ సినిమా, థియేటర్స్ లో రిలీజ్ అయినా ఇంత బిజినెస్ ను ఈ ఎక్స్ పెరిమెంటల్ మూవీ సొంతం చేసుకుని ఉండక పోవచ్చు. ఇక సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.