2020 ఇయర్ లో రెండు మూడు నెలలు అన్ని ఇండస్ట్రీలు అద్బుతాలు సృష్టించాయి, అల్టిమేట్ విజయాలు దక్కాయి, కానీ ఫస్ట్ వేవ్ ఓ రేంజ్ లో దెబ్బ కొట్టడం తో తిరిగి తేరుకోవడానికి ఏకంగా ఇయర్ ఎండ్ వరకు ఆగాల్సి వచ్చింది, బాలీవుడ్ తిరిగి తేరుకోలేక పోయింది కానీ మిగిలిన ఇండస్ట్రీలు అన్నీ కూడా 2021 ఇయర్ మొదటి మూడు నెలల పాటు బాగా తెరుకున్నాయి, అన్ని ఇండస్ట్రీలు ఒకెత్తు అయితే టాలీవుడ్ మాత్రం మరో లెవల్ లో…
దూసుకు పోయింది, కానీ మళ్ళీ అనుకోకుండా సెకెండ్ వేవ్ దారుణమైన దెబ్బ కొట్టడంతో పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి. మళ్ళీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యి నార్మల్ గా జనాలు థియేటర్స్ కి తరలి వస్తారో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైం లో ఇప్పటి వరకు..
ఇండియా లో రిలీజ్ అయిన అన్ని ఇండస్ట్రీల సినిమాల విషయం లో మోస్ట్ పాపులర్ 10 మూవీస్ లిస్టు ని IMDB వాళ్ళు రిలీజ్ చేశారు, అందులో ఫస్ట్ ప్లేస్ లో కోలివుడ్ టాప్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా నిలవగా ధనుష్ నటించిన కర్ణన్ సినిమా 6 వ ప్లేస్ లో నిలిచింది.
ఇక టాలీవుడ్ తరపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా 7 వ ప్లేస్ ని సొంతం చేసుకోగా మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా 9 వ ప్లేస్ ను సొంతం చేసుకుంది. మలయాళ డిజిటల్ బ్లాక్ బస్టర్ దృశ్యం 2 నాలుగో ప్లేస్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో…
ఈ సినిమాలు మోస్ట్ పాపులర్ మూవీస్ గా నిలవడం విశేషం, వకీల్ సాబ్ క్రేజ్ సాలిడ్ గానే ఉన్నప్పటికీ మాస్టర్ టాప్ ప్లేస్ లో ఉండటం వకీల్ సాబ్ 7 వ ప్లేస్ లో ఉండటం గమనార్హం. రిలీజ్ టైం కి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ఇలా అయ్యి ఉండొచ్చు, అదే టైం లో మాస్టర్ లాస్ట్ ఇయర్ నుండి వార్తల్లో నిలుస్తూ ఉండటం వలన టాప్ ప్లేస్ ని సొంతం చేసుకుంది.