Home గాసిప్స్ బాక్ టు బాక్ హిట్స్…లింగుస్వామి తో మూవీ కి రామ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్...

బాక్ టు బాక్ హిట్స్…లింగుస్వామి తో మూవీ కి రామ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!

1609
0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ సూపర్ హిట్స్ తో మంచి జోరు మీదున్నాడు, కెరీర్ లో ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన ఊరమాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సొంతం అవ్వగా తర్వాత చేసిన రెడ్ మూవీ కంటెంట్ పరంగా ఒరిజినల్ అంతగా మెప్పించక పోయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ ను వాడుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసి…

RED The Film 2 Days Total Worldwide Collections!

సూపర్ హిట్ గా నిలిచింది, దాంతో బాక్ టు బాక్ హిట్స్ తో రామ్ ఫుల్ జోరు మీదున్నాడు, మీడియం రేంజ్ హీరోలలో ఇప్పుడు ఫుల్ ఫాం లో మాస్ హిట్స్ తో మాస్ క్రేజ్ ని మరింత పెంచుకున్న రామ్ ఇప్పుడు తన రెమ్యునరేషన్ ని మరింతగా పెంచాడని…

RED The Film 4 Days Total Worldwide Collections!

టాలీవుడ్ లో స్ట్రాంగ్ టాక్ వినిపిస్తుంది, ఇది వరకు రామ్ ఒక్కో సినిమా కి 5-6 కోట్ల మేర రెమ్యునరేషన్ ని తీసుకుంటూ ఉండేవారు, ఇస్మార్ట్ శంకర్ మరియు రెడ్ మూవీస్ విషయం లో కూడా ఇదే రేంజ్ రెమ్యునరేషన్ ని రామ్ తీసుకున్నట్లు టాక్ ఉంది. కానీ ఇప్పుడు…

లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ తెలుగు తో పాటు తమిళ్ లో బైలింగువల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే, భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా లో మాధవన్ కూడా కీలక రోల్ చేస్తున్నారట, ఇక ఈ సినిమా కి గాను రామ్ రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసి ఏకంగా 10 కోట్ల మేర రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.

ప్రీవియస్ 2 మూవీస్ తో పోల్చితే ఇది ఆల్ మోస్ట్ డబుల్ రెమ్యునరేషన్ అనే చెప్పాలి, కానీ ఇది బైలింగువల్ మూవీ కాబట్టి ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో డే 1 మీడియం రేంజ్ మూవీస్ ఓపెనింగ్స్ రికార్డులను బ్రేక్ చేసిన రెడ్ తో 50% లిమిటేషన్ వలన మిస్ అయినా ఈ సినిమా తో కొత్త బెంచ్ మార్క్ ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

RED The Film 8 Days Total Worldwide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here