బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు లాస్ట్ ఇయర్ నుండి చాలా వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం తక్కువగా ఉండటం తో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ నే సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. సౌత్ మూవీస్ కొన్ని అయినా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగలిగాయి కానీ బాలీవుడ్ మూవీస్ మాత్రం చాలా తక్కువగా ఆడియన్స్ ముందుకు వచ్చాయి. వచ్చినవి కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి క్రియేట్ చేయలేక పోయాయి.
ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత కూడా ఆడియన్స్ ముందుకు వెంటనే సినిమాలు రిలీజ్ చేయాలి అంటే మేకర్స్ బయపడుతున్నారు. ఆ సినిమాలను ఎక్కువ రేటు పెట్టి కొంటె జనాలు చూడటానికి వస్తారో రారో అన్న డౌట్ లో థియేటర్ ఓనర్స్ ఉండటంతో డైరెక్ట్ రిలీజ్ కే ట్రై చేస్తున్నారు చాలా మంది.
లేటెస్ట్ గా ఇలానే ట్రై చేశారు ఆలియా భట్ మెయిన్ లీడ్ చేసిన గంగూ భాయ్ కథియవాడ సినిమా మేకర్స్. ఈ సినిమాను ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ రోజున అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు రెండూ ఆ డేట్ ని మిస్ అవుతూ ఉండగా ఆలియా సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కోసం…
మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఉంటే మహా అయితే 30-40 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగి ఉండేది కానీ డైరెక్ట్ రిలీజ్ కోసం ఏకంగా 70 కోట్ల దాకా రేటు ఇవ్వడానికి సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు. కానీ మేకర్స్ అప్పుడు ఏమి చెప్పలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల వలన సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కోసం ఇంకా బెటర్ ఆఫర్స్ ఉన్నాయోమో…
అని ట్రై చేస్తే ఉన్న రేటు కాస్త తగ్గించేసి ఇప్పుడు కేవలం 50 కోట్ల రేంజ్ రేటు ఇవ్వగలం అంటూ చెబుతున్నారట OTT వాళ్ళు. దాంతో సినిమా యూనిట్ కి కోపం వచ్చి ఇలా అయితే పరిస్థితులు సెట్ అయ్యేదాకా ఆగి థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవుతున్నారని అంటున్నారు. మరి ఈ నిర్ణయమే ఫైనల్ అవుతుందా లేక బెటర్ ఆఫర్ ఇంకా ఏమైనా వస్తే ఓకే చేస్తారో చూడాలి ఇక…