Home గాసిప్స్ 17 రోజుల గ్యాప్ తో డిజిటల్ రిలీజ్….అయినా సెన్సేషనల్ రేటు సొంతం!!

17 రోజుల గ్యాప్ తో డిజిటల్ రిలీజ్….అయినా సెన్సేషనల్ రేటు సొంతం!!

0

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రతీ ఇయర్ మినిమమ్ 3 నుండి 4 సినిమాలు చేస్తూ వచ్చే బిజీ హీరో. కానీ పాండమిక్ టైం కాబట్టి సినిమాలకు గ్యాప్ ఇచ్చి అంతా సెట్ అయ్యాక మళ్ళీ సినిమాలు మొదలు పెడతాడు అనుకుంటే ఏకంగా పాండమిక్ టైం లో అందరూ షూటింగ్ లు మొదలు పెట్టాలి అంటేనే బయపడుతున్న సమయంలో ఏకంగా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి సర్ప్రైజ్ చేశాడు అక్షయ్ కుమార్. ఆ సినిమానే బెల్ బాటం…

ఈ ఒక్క సినిమా అనే కాదు… ఈ సెకెండ్ వేవ్ టైం లో కూడా తక్కువ మంది క్రూ తోనే షూటింగ్ లు కొనసాగిస్తున్నాడు. ఇక బెల్ బాటం సినిమా విషయానికి వస్తే ఇప్పుడు ఈ సినిమానే బాలీవుడ్ తరుపున లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు పాండమిక్ టైం లో…

రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అతి పెద్ద సినిమా గా నిలిచింది, వచ్చే నెల 27న ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రాబోతున్న ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం భారీ ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పి థియేట్రికల్ రిలీజ్ కి ఓకే చెప్పొంది. డిజిటల్ రిలీజ్ కోసం ఏకంగా…

130 కోట్ల రేంజ్ ఆఫర్ వచ్చినా కానీ నో చెప్పిన టీం జులై 27 న సినిమాను రిలీజ్ చేస్తుండగా సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన 17 రోజుల తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ గ్యాప్ కారణంగా సినిమా డిజిటల్ రిలీజ్ రేటు తగ్గింది కానీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత కూడా బిగ్గెస్ట్ రేటు సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

17 రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ కి గాను ఈ సినిమా 70 కోట్ల రేటు సొంతం కానుందని అంటున్నారు ఇప్పుడు. అంటే 130 కోట్ల కి 70 కోట్లతో ఫైనల్ చేయనుండగా మిగిలిన 60 కోట్ల వర్త్ బిజినెస్ థియేటర్స్ లో జరిగినా హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ సాలిడ్ గా రావొచ్చు కాబట్టి రెండు వైపులా సినిమా సాలిడ్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకోవచ్చు. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here