విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్ లో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగు లో క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో నారప్ప పేరు తో రీమేక్ చేయగా లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అప్పటి నుండే ఫస్ట్ వేవ్ అండ్ ఈ ఇయర్ సెకెండ్ వేవ్ ల వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమాను రీసెంట్ గా డైరెక్ట్ గా….
డిజిటల్ రిలీజ్ కి అమ్మేశారు అన్న వార్తలు టాలీవుడ్ మొత్తం చక్కర్లు కొట్టగా మేకర్స్ కూడా ఈ విషయం పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వక పోవడం తో ఇది ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది. ఇక రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను కూడా కంప్లీట్ చేసుకోవడం తో…
ఈ న్యూస్ ఆల్ మోస్ట్ పక్కా అని తేలగా ఇప్పుడు సెన్సార్ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ కూడా త్వరగానే బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా ఒరిజినల్ కి మించే విధంగానే ఉంటుందని అంటున్నారు. యంగ్ రోల్ ఒక్కటి మరీ ఒరిజినల్ లో ఉన్నట్లు కాకుండా…
కొంచం లుక్ మార్చి తీసారని, అలాగే అక్కడక్కడా తెలుగు కి తగ్గట్లు కొన్ని మార్పులు తప్పితే ఒరిజినల్ లో ఉన్నట్లే సీన్ టు సీన్ తెరకెక్కించరని అంటున్నారు, కానీ యాక్షన్ సీన్స్ డోస్ తెలుగు లో మరింత పెంచారని, ఎమోషనల్ సీన్స్ లో సెంటిమెంట్ డోస్ కూడా వెంకీ తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని పెంచారు అంటున్నారు.
సినిమా కథ ఏంటి అనేది ఆల్ మోస్ట్ అందరికి తెలిసిందే కాబట్టి అది చెప్పడం లేదని అంటున్నారు. రా రస్టిక్ గా మాస్ కంటెంట్ తో కలిపి తెరకెక్కిన నారప్ప కచ్చితంగా ఆడియన్స్ అంచనాలను అందుకునే అవకాశం ఉన్న సినిమాగా చెబుతున్నారు. సెన్సార్ అయ్యాక ఇలాంటి టాక్ లు రావడం కామనే కానీ ఇది రీమేక్ కాబట్టి నిజం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.