10 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ని ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ తో సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి తర్వాత వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ దూసుకు పోతూ ఉండగా మధ్యలో ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ లు ఇబ్బంది పెడుతున్నా కానీ మెగాస్టార్ జోరు తగ్గడం లేదు. వరుస పెట్టి సినిమాలను కమిట్ అయిన మెగాస్టార్ ఇప్పుడు ముందుగా ఆచార్యతో రాబోతుండగా ఈ సినిమా తర్వాత…
రెండు సూపర్ హిట్ రీమేక్ లను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే, ఒకటి మోహన్ రాజా డైరెక్షన్ లో కాగా మరోటి ఫ్లాఫ్ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో. ముఖ్యంగా మెహర్ రమేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఇప్పటి వరకు అందుకొక పోవడం…
కొత్త సినిమా అసలు మొదలు పెట్టి 8 ఏళ్ళు అవుతున్న నేపధ్యంలో మెగాస్టార్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, వేదళం రీమేక్ ని ఎలా తీస్తాడు అన్నది ఆసక్తిగా మారగా మెగాస్టార్ ముందు లూసిఫర్ రీమేక్ చేయాలనీ డిసైడ్ అవ్వడం తో మెహర్ తో తాను లేకుండా ఉన్న మిగిలిన సీన్స్ ని…
ముందు డైరెక్ట్ చేయమని చెప్పగా ఇప్పటి వరకు కొంత భాగాన్ని ఆల్ రెడీ షూటింగ్ చేశాడు మెహర్ రమేష్, ఈ సినిమా డైరెక్షన్ అవకాశాన్ని మెహర్ రమేష్ కి ఇస్తూ మెగాస్టార్ ఒక కండీషన్ ని కూడా పెట్టినట్లు తెలుస్తుంది. తన రెమ్యునరేషన్ కాకుండా టోటల్ సినిమా 25-30 కోట్ల లోపు బడ్జెట్ లోనే పూర్తీ చేయాల్సి ఉంటుందని బడ్జెట్ కంట్రోల్ అస్సలు తప్పకూడదు…
అంటూ కండీషన్ ని మెగాస్టార్ పెట్టాడని టాలీవుడ్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మెహర్ రమేష్ సినిమాలు ఓవర్ బడ్జెట్ వలన ఇబ్బందులు పడిన సందర్బాలు అన్ని సినిమాలకు ఉన్నాయి. ఈ విషయంలో మట్టుకు మెగాస్టార్ ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండలాని ఫిక్స్ అయ్యారట. ఇక వచ్చే ఇయర్ ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.