టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన హిస్టారికల్ రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న అప్ కమింగ్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అన్న విషయం అందరి కీ తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలి సిందే.
కానీ షూటింగ్ కి సంభంధించిన ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడం సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుందని టాక్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో వినిపిస్తుంది. దాంతో తెరుకున్న నిర్మాతలు అఫీషియల్ గా సినిమా ఎట్టి పరిస్థితులలో.
సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వస్తుందని, నవంబర్ 10 వరకు టాకీ పార్ట్ మొత్తం అయిపోతుందని తర్వాత సాంగ్స్ షూటింగ్ ఉంటుందని కంఫామ్ చేశారు. దాంతో సంక్రాంతి డేట్ నుండి తగ్గింది అన్న వాదనలను తగ్గలేదు లేదు చెప్పడంతో జనవరి 10 నుండి రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ ఊచకోత ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.