అరవింద సమేత 380, భరత్ అనే నేను 320, రంగస్థలం 330, సవ్యసాచి 200… చైతూ కుమ్ముతున్నాడు గా

0
995

  అక్కినేని యువసామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సవ్యసాచి భారీ ఎత్తున నవంబర్ 2 న రిలీజ్ కానుండగా అన్ని ఏరియాలలో సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇక సినిమా కర్నాటక లో కూడా భారీ గా రిలీజ్ కానుండగా ఒక్క బెంగళూరు లోనే సినిమా మొదటి రోజు 200 కి పైగా షోల ని సొంతం చేసుకోనుంది. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే రికార్డ్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

కాగా ఈ ఇయర్ సమ్మర్ నుండి రిలీజ్ అయిన సినిమాల్లో రంగస్థలం మొదటి రోజు 330 షోలని, తర్వాత భరత్ అనే నేను 320 షోలని సొంతం చేసుకోగా రీసెంట్ బిగ్గీ అరవింద సమేత ఇక్కడ రికార్డ్ లెవల్ లో 380 షోలని మొదటి రోజు సాధించింది.

ఇప్పుడు నాగ చైతన్య సినిమా కూడా దుమ్ము లేపుతూ 200 షోల ని అందుకోవడంతో సినిమా కర్నాటక లో కూడా మంచి వసూళ్లని అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. టాక్ బాగుంటే సినిమా కర్నాటకలో కూడా మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!